హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

#NTR Biopic: ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రివ్యూ టాక్..

#NTR Biopic: ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ప్రివ్యూ టాక్..

45 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న బాలకృష్ణ నట ప్రస్థానం

45 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్న బాలకృష్ణ నట ప్రస్థానం

NTR Kathanayakudu Preview Talk | మహానటుడు తెలుగువారి ఆరాథ్య నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ..‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  ప్రీమియర్ షోస్ పడ్డాయి.

ఇంకా చదవండి ...

  మహానటుడు తెలుగువారి ఆరాథ్య నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ..‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  ప్రీమియర్ షోస్ పడ్డాయి.

  విడుదలన ప్రతి చోట ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. క్రిష్ ఎలాంటి కాంట్రవర్సీలకు పోకుండా కథను ఒక పద్దతిలో తెరకెక్కించాడనే టాక్ వినబడుతోంది. ఫస్ట్ హాఫ్ ఎన్టీఆర్  కథానాయకుడిగా ఎదిగిన వైనం బాగుందట. ఆనాటి తెలుగు సినిమా వైభవాన్ని క్రిష్ కళ్లకు కట్టేలా తెరకెక్కించాడు. బాలయ్య పర్ఫామెన్స్ సూపర్ అనే టాక్ వినబడుతోంది.

  ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో దుర్యోధనుడిగా బాలయ్య

  ఎన్టీఆర్ తన సినీ జీవితంలో ఎన్నో వందల సినిమాల్లో వేసిన 63 అద్భుతమైన పాత్రలను ఈ సినిమాలో  పోషించాడు బాలకృష్ణ . ఈ రకంగా తండ్రి రామారావు చేసిన పాత్రలను తాను చేయలేదన్న లోటును పూడ్చుకున్నాడు. ఇప్పటి వరకు బాలయ్య తన సినీ జీవితంలో ఎన్నో పాత్రలు పోసించినా..తన తండ్రి ఎన్టీఆర్ పాత్రను పోషించడం కత్తి మీద సామే. అలా వెండితెరపై తన తండ్రి పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయాడనే టాక్ వినబడుతోంది.

  ‘ఎన్టీఆర్ కథానాయుకుడు’లో వెేంకటేశ్వర స్వామిగా బాలకృష్ణ

  ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఎమెషనల్‌గా ఉంది. 1984లో మద్రాస్‌లో బసవతారకం హాస్పిటల్‌లో ట్రీట్మెంట్‌తో ఈ సినిమా స్టార్ట్ అవుతోంది. మొత్తం సినిమా బసవ తారకం యాంగిల్‌తో సాగితుంది. సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన ..చివరి అరగంట ఉత్కంఠ రేకెత్తించేలా ఉంది.

  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’

  మొత్తానికి ఫస్ట్ పార్ట్‌ను ఆసక్తికరంగా ముగించి సెకండ్ హాఫ్‌ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాపై క్రిష్ ఆసక్తి రేకెత్తించాడు. మొత్తానికి ఈ సంక్రాంతికి బాలయ్య...తన తండ్రి బయోపిక్‌తో హిట్ కొట్టాడనే టాక్ వినబడుతోంది.

  ఇవి కూడా చదవండి 

  టాలీవుడ్‌లో బయోపిక్ ట్రెండ్...‘ఎన్టీఆర్’ మూవీతో పెరిగిన క్రేజ్

  ఎన్టీఆర్‌కు సావిత్రి స‌వాల్.. ‘మ‌హాన‌టి’ని ‘క‌థానాయ‌కుడు’ మరిపించాడా ?

  సంక్రాంతి ‘బాలయ్య’..పండగ బరిలో ఆయనకు ‘ఎన్టీఆర్’ ఎన్నో సినిమానో తెలుసా

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bala Krishna Nandamuri, NTR Biopic, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు