మహానటుడు తెలుగువారి ఆరాథ్య నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌కు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ ..‘ఎన్టీఆర్’ బయోపిక్‌ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఈ బయోపిక్‌ను ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ రెండు భాగాలుగా తెరకెక్కించారు. మరికొన్ని గంటల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కానుంది. ఆల్రెడీ విడుదల ‘వెండితెర దొర’ అనే లిరికల్ వీడియో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ నుంచి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. వేములపల్లి శ్రీకృష్ణ రాసిన పాటకు కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు.
ఈ పాటలో బాలకృష్ణ వాళ్ల తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ప్రపంచ సినీ చరిత్రలో ఒక తండ్రి బయోపిక్‌లో నటిస్తోన్న కుమారుడిగా బాలయ్య ఒక రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు ఈ సినిమా ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 9నే విడుదలవుతోంది. తండ్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతోన్న ఈసినిమాతో బాలయ్య పూర్తిస్థాయి నిర్మాత అవతారం ఎత్తారు.
అంతేకాదు ఎన్టీఆర్ తన సినీ జీవితంలో ఎన్నో వందల సినిమాల్లో వేసిన 63 అద్భుతమైన పాత్రలను ఈ సినిమాలో పోషించాడు బాలకృష్ణ . ఈ రకంగా తండ్రి రామారావు చేసిన పాత్రలను తాను చేయలేదన్న లోటును పూడ్చుకున్నాడు. ఇప్పటికే ఆయా పాత్రలకు సంబంధించిన లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘యూ’ సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు ఈ సినిమా 171 నిమిషాల నిడివితో తెరకెక్కింది.
తాజాగా ఈ సినిమాకు ఏపీ ప్రభుత్తం జనవరి 9 నుంచి జనవరి 16 వరకు ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు ఆరు షోలు ప్రదర్శించేందకు అనుమతి ఇస్తూ జీవో జారీ చేసింది.
Andhra Pradesh Government sanctions special permission for #NTRKathanayakudu special shows from Jan 9th to Jan 16th.
Shows to begin from 5 AM in the morning. A total of six shows daily for eight days.#NTRBiopic #NandamuriBalakrishna @DirKrish @NBKFilms_ @VaaraahiCC @vishinduri pic.twitter.com/PilwDkRdZi
— NBK FILMS (@NBKFilms_) January 7, 2019
ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి
Sankranti 2019: సెన్సార్ సర్టిఫికేట్స్.. సినిమా రన్ టైమ్ వివరాలు..
జగన్ వర్సెస్ ‘ఎన్టీఆర్’...ఏపీ రాజకీయాల్లో బిగ్ డే
తిరుమల శ్రీవారి సేవలో ఎన్టీఆర్ బయోపిక్ టీం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bala Krishna Nandamuri, Krish, NTR Biopic, Telugu Cinema, Tollywood