news18-telugu
Updated: October 17, 2020, 3:48 PM IST
పల్సర్ ఎన్ఎస్200(Image source: Bajaj)
తమ సంస్థ నుంచి వచ్చిన టూవీర్లను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్ది మార్కెట్లోకి విడుదల చేస్తామని బజాజ్ ప్రకటించింది. పల్సర్ సిరీస్‌లో వచ్చిన NS, RS వేరియంట్లను మరిన్ని రంగుల్లో అందిస్తామని తెలిపింది. ఈ బైక్‌లు ఇప్పుడు బర్న్ట్ రెడ్(మాట్టె ఫినిష్), ప్లాస్మా బ్లూ(శాటిన్ ఫినిష్) రంగుల్లో కూడా లభించనున్నాయి. వీటిని అల్లాయ్ వీల్స్‌తో అందిస్తామని బజాజ్ సంస్థ ప్రకటించింది. బైక్‌ల ముందు, వెనుక భాగాల్లో ఫెండర్లు కార్బన్ ఫైబర్ ఆకృతిలో ఉన్నాయి. స్టాంపింగ్ ప్యాటర్న్ సీట్లు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఆర్ఎస్ 200కు మంచి ఆధరణపల్సర్ సిరీస్‌లో వచ్చిన RS200 మోడల్‌కు మంచి ఆధరణ లభించింది. 4 వాల్వ్ ట్రిపుల్ స్పార్క్ DTS-i ఇంజిన్‌తో ఈ బైక్ లభిస్తుంది. దీనికి ఫ్యూయెల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూలింగ్ వంటి ఫీచర్లు అదనంగా ఉన్నాయి. డ్యుయల్ ఛానల్ ABS, 300 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌లతో బైక్‌ను రూపొందించారు. 22-సిసి సామర్థ్యముండే ఈ ఇంజన్ 24.5 PS శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటి నుంచి కొత్త పల్సర్ RS200 మూడు రంగుల్లో లభించనుంది. ఈ జాబితాలో బర్న్ట్ రెడ్ (మాట్టే ఫినిష్), మెటాలిక్ పెరల్ వైట్, ప్యూటర్ గ్రే ఉన్నాయి.
ఆ మోడళ్లు కూడా..
పల్సర్ NS200 మోడల్ బైక్ లిక్విడ్ కూల్డ్, ఫోర్ వాల్వ్, ప్యూయెల్ ఇంజెక్షన్ ట్రిపుల్ స్పార్క్ డిటిఎస్-ఐ ఇంజిన్‌తో లభిస్తుంది. ఇది 24.5 PS శక్తిని అందిస్తుంది. పల్సర్ NS160 17.2 PS శక్తిని ఇస్తుంది. ఈ రెండు మోడళ్లు ఇప్పటి నుంచి నాలుగు కొత్త రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. బర్న్ట్ రెడ్ (మాట్టే ఫినిష్), మెటాలిక్ పెరల్ వైట్, ప్యూటర్ గ్రే, ప్లాస్మా శాటిన్ బ్లూ వేరియంట్లలో ఇవి లభిస్తాయి.
బ్రాండ్ విలువ పెంచేలా..
పల్సర్ RS200, NS200 మోడల్ బైక్‌లను ఇంటర్నేషనల్ టెక్నాలజీతో రూపొందించామని బజాజ్ ఆటో హెడ్ మార్కెటింగ్ నారాయణ్ సుందరరామన్ చెబుతున్నారు. ప్రస్తుత పండుగ సీజన్లో వినియోగదారుల కోసం సరికొత్త కలర్ ఆప్షన్లలో బైక్‌లను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. మార్కెట్ నాయకత్వాన్ని నిలబెట్టుకునేలా, కస్టమర్లకు సరికొత్త రైడింగ్ అనుభూతిని అందించేలా ఈ బైక్‌లు ఉంటాయని చెప్పారు.
Published by:
Sumanth Kanukula
First published:
October 17, 2020, 3:48 PM IST