తొలిసారి అమ్మమాటలు విన్న చిన్నారి రియాక్షన్ ఇదీ... వైరల్ వీడియో

ఈ వైరల్ వీడియోలో... చిన్నారిని హెలో అనమని తల్లి అడిగితే... ఆ మాట విన్న చిన్నారి చక్కగా నవ్వేసింది. మాటలు సరిగా రాకపోయినా... తల్లి మాటలు విన్న ఆనందం చిన్నారి కళ్లలో కనిపించింది.

news18-telugu
Updated: December 8, 2019, 11:19 AM IST
తొలిసారి అమ్మమాటలు విన్న చిన్నారి రియాక్షన్ ఇదీ... వైరల్ వీడియో
చిన్నారి స్మైల్ (credit - twitter - addisonjrp)
  • Share this:
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఈ చిన్నారి వీడియో ఒకటి. చెముడు సమస్యతో బాధపడుతున్న ఆ పాపకి తండ్రి "హియరింగ్ ఎయిడ్" (చెముడు మిషన్) తగిలించి... దాన్ని ఆన్ చేశాడు. అంతే... ఆ చిన్నారికి ద్వనులు వినే అవకాశం దక్కింది. వెంటనే తల్లి... పాపని పలకరిస్తూ... హెలో అనమని కోరింది. అంతే తొలిసారి తల్లి మాటలు (ధ్వనులు) విన్న ఆ చిన్నారికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. పకపకా నవ్వేస్తూ... ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చిన వీడియో వైరల్ అయ్యింది. పాప తండ్రి పాల్ అడిసన్... ఆ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. తమ పాపకు కొత్త హియరింగ్ ఎయిడ్స్ సెట్ చెయ్యగానే తను ఇలా స్పందించిందని వీడియోలో కామెంట్ రాశాడు. ఈ వీడియోని ఇప్పటికే 48 వేల మందికి పైగా చూశారు. 8వేల మందికి పైగా కామెంట్లు రాశారు. ఈ వీడియో చాలా బాగుందని కొందరు అంటుంటే... ప్రేమకు ధ్వనులతో పనిలేదని కొందరు అంటున్నారు.

 

 

వెంకీ మామ బ్యూటీ రాశీ ఖన్నా క్యూట్ పిక్స్ఇవి కూడా చదవండి :

FD : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల మార్పు... ఏ బ్యాంకులో ఎంతంటే...

పెళ్లికొడుకును బంధించి... మరొకరిని పెళ్లి చేసుకున్న వధువు

ఇంటర్నెట్‌లో టీచర్ నగ్న చిత్రాలు... ఎలా వచ్చాయ్?

నిత్యానంద వీడియో రిలీజ్... పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరిందిగా...

IND VS WI : వెస్టిండీస్‌తో నేడు రెండో టీ20... గెలిస్తే సిరీస్ భారత్‌దే...
First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు