ఏదైనా ఓ వీడియో(Video)బాగా పాపులర్( Popular)కావాలంటే అందులో ఏదో వింత ఉండాలి. లేదంటే యాక్షన్ ఉండాలి. ఈవేవి లేకుండానే బేబీ షార్క్ డ్యాన్స్( Baby shark dance)వీడియో యూట్యూబ్(YouTube)ని షేక్ చేస్తోంది. ఇది వాస్తవం. లక్షలు, కోట్లు కాదు వెయ్యి కోట్ల వ్యూస్(10 billion views) వచ్చాయంటే బేబీ షార్క్ డ్యాన్స్ వీడియోకి ఎంత క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియో అయితే పిల్లల్ని కట్టిపడేస్తోన్న వైనంపై పెద్ద చర్చే జరుగుతోంది. యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్ రావడం అంటే ఆషామాషి విషయం కాదు. అదే పది మిలియన్ వ్యూస్ వస్తే చాలా గొప్ప విషయంగా భావించాలి. అలాంటిది ఒక వీడియో 1000కోట్ల వ్యూస్(10 billion views) సొంతం చేసుకుంటే ఇంకేమనాలి. అన్ని సార్లు చూడటానికి అసలు అది ఏం వీడియో సైన్స్‌కి సంబంధించినదా, లేక పోరాటాలు, యుద్ధాలకు సంబంధించిన వీడియో కాదు. బేబీ షార్క్ డ్యాన్స్. అంటే పిల్లలు చూసే మ్యూజిక్ వీడియో మాత్రమే కేవలం రెండు నిమిషాలకుపైగా ఉన్న ఈ వీడియోని పింక్ ఫాంగ్ అనే యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశారు. ఆ చిన్నపిల్లలు చూసే బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో వెయ్యి కోట్ల 89లక్షల 32వేల 715 1000,89,32,715)వ్యూస్ వచ్చాయి. అంతే కాదు ఈ వీడియోకి వచ్చిన లైక్‌లు కూడా అదే రికార్డు స్థాయిలో ఉన్నాయి. 3.2కోట్ల లైకులు వచ్చిన మ్యూజిక్ వీడియోగా కొత్త రికార్డును సొంతం చేసుకుంది బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో.
ఇది ఖచ్చితంగా అరుదైన రికార్డే..
పిల్లలు చూసే వీడియో ఏంటీ వేల కోట్ల వ్యూస్ రావడం ఏమిటని కొట్టిపారేయకండి. ఈవీడియోలో కొందరు చిన్నపిల్లలు, కొన్ని యానిమేషన్ బొమ్మలు అద్బుతమైన పెర్ఫార్మెన్స్ ప్రదర్శించడం చూడొచ్చు. అందుకే ఈ వీడియోకి అంత పాపులారిటీ దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో ఈ పాట కనిపిస్తే చాలు పదే పదే చూస్తున్నారు. పాటలో సాహిత్యం గొప్పగా లేకపోయినప్పటికి పాట మాత్రం ఎంతో లయబద్ధంగా సాగుతుంది.
View this post on Instagram
పిల్లలు కాదు రికార్డ్ క్రియేటర్స్ ..
ఏం చేస్తే ఏంటి రికార్డు సృష్టించారు. అది పిల్లల వీడియో అయినా, పెద్దల వీడియో అయినా. అందుకే ఇప్పుడు యూట్యూబ్‌లో టాప్ వ్యూస్‌తో రారాజుగా నిలిచింది బేబీ షార్క్ డ్యాన్స్ వీడియో. చూడటానికి ఏమాత్రం కొత్తదనం, క్రియేటివిటీ లేని ఈ వీడియోను ఇన్ని వేల కోట్ల సార్లు ఎలా చూసారబ్బా అనే డౌట్ అందరిలో కలుగుతుంది. కానీ చిన్నపిల్లలకు మాత్రం ఈ వీడియో హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Star kids, Viral Video, Youtube