HOME »NEWS »TRENDING »baby jesus dolls with masks and hazmat suits videos goes viral krs

Christmas: బేబీ జీసస్​కు మాస్కులు.. హజ్మత్​ సూట్​లు.. చూడముచ్చటగా వీడియో

Christmas: బేబీ జీసస్​కు మాస్కులు.. హజ్మత్​ సూట్​లు.. చూడముచ్చటగా వీడియో
Twitter image

కరోనా ప్రభావం నేపథ్యంలో క్రిస్మస్ పండుగను వినూత్నంగా జరుపుకునేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఇదే తీరుగానే బేబీ జీసస్ బొమ్మలను క్రియేటివిటీతో తయారు చేస్తున్నారు.

 • Share this:
  ప్రపంచం మొత్తం క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతోంది. బేబీ జీసస్ బొమ్మలు, పండుగ అలంకరణ సామగ్రితో మార్కెట్లు, షాప్​లు నిండిపోయాయి. ప్రజలు అప్పుడే షాపింగ్ కూడా జోరుగా చేస్తున్నారు.

  అయితే ఈ ఏడాది క్రిస్మస్​పైనా కరోనా ప్రభావం పడింది. ఎప్పటిలా కాకుండా ఈసారి కొంచెం వినూత్నంగా వేడుకలు జరిగేలా కనిపిస్తున్నాయి. కరోనా ప్రభావం ఇంకా ఉండడం సహా కొత్తగా స్ట్రెయిన్ రాకతో బ్రిటన్​ లో ఏకంగా లాక్​డౌన్ అమలులోకి వచ్చింది. చాలా దేశాలు సైతం అప్రమత్తమయ్యాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సృజనాత్మకం(ఇన్నోవేటివ్​)గా పండుగను జరుపునేందుకు కొందరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  బాల యేసు(బేబీ జీసస్) బొమ్మలను మాస్కులు, ఫేస్ షీల్డ్​లు, హజ్మత్ సూట్లతో అలంకరిస్తున్నారు. కొన్ని చోట్ల పీపీఈ కిట్లు సైతం వేస్తూ క్రియేటివిటిని చాటుకుంటున్నారు. బొలివియా, దక్షిణ అమెరికాతో పాటు తదితర దేశాల్లో ఈ దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఈ వీడియోలకు నెజిటన్లు ఫిదా అవుతున్నారు. లైక్​లు, కామెంట్లు వెల్లువెత్తున్నాయి.

  బొలివియాలో ఏకంగా కొవిడిఫీల్డ్ బేబీ జీసస్ అనే పేరు ఫేమస్ అయిపోయింది. మాస్కులు, హజ్మత్​ సూట్లు వేసిన బొమ్మలను ఏ పేరుతో అమ్ముతుండగా.. ప్రజలకు సైతం వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. “నా బేబీ జీసస్ పూర్తి సురక్షితం. ఆయనకు హజ్మత్ సూట్, ఫేస్ మాస్క్ ఉంది” అని ఓ వ్యాపారి అన్నారు.

  ఇక హంగేరీలో ఏర్పాట్లు చేసిన చాక్లెట్​ శాంటాక్లాజ్​ కు వైట్ మాస్క్ వేయడం అందరినీ ఆకర్షిస్తోంది. అలాగే భారత్​లోని ముంబైలో శాంటాక్లాజ్​ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు పంచుతూ జాగ్రత్తలు చెబుతున్నారు.

  క్రీస్తు పుట్టిన డిసెంబర్ 25ను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. క్రిస్మస్ ట్రీలను ఏర్పాట్లు చేసి ఇళ్లను అలంకరించుకుంటారు. ప్రపంచానికి వెలుగులు పంచిన రోజుగా భావిస్తారు. శాంటాక్లాజ్ ఇంటింటికీ తిరిగి పిల్లలకు బహుమతులు ఇస్తారు. చాలా మంది అవసరార్థుల కోసం డొనేషన్లును సైతం ఆ రోజు ఇస్తారు.
  Published by:Krishna P
  First published:December 22, 2020, 11:10 IST