హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వింత శిశువు.. తల పంది తల ఆకారంలో.. చర్మంపై పొలుసులు.. ఎక్కడంటే..

వింత శిశువు.. తల పంది తల ఆకారంలో.. చర్మంపై పొలుసులు.. ఎక్కడంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ శిశువు తల పంది తల ఆకారంలో, చర్మంపై పొలుసులతో జన్మించడం వైద్యులను షాక్‌కు గురిచేసింది.

ఒడిశా రాష్ట్రంలో ఓ మహిళ వింత శిశువుకు జన్మనిచ్చింది. అరుదైన చర్మ రుగ్మత Harlequin Ichthyosis‌తో శిశువు జన్మించింది. ఆ శిశువు చర్మం చేప చర్మాన్ని పోలి ఉండటంతో పాటు, తల పంది తలను తలపిస్తోంది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజామ్ జిల్లా బరంపురంలోని MKCG మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బట్టకుమరా గ్రామానికి గర్భిణికి పురిటినొప్పులు రావడంతో ఆమెని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో 2.40 కిలోల బరువున్న శిశువుకి ఆమె జన్మనిచ్చింది. అయితే ఆ శిశువును చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. శిశువు తల పంది తల ఆకారంలోనూ, చర్మంపై పొలుసులు ఉండి అవి ఊడిపోతున్నట్లుగానూ కనిపిస్తోంది. అయితే ఇలాంటి చర్మ రుగ్మతతో జన్మించిన శిశువు.. ఇంతసేపు జీవించి ఉండటం చాలా అరుదు అని వైద్యులు చెబుతున్నారు.

పది లక్షల మంది శిశువుల్లో ఒక్కరికి ఇలాంటి చర్మ రుగ్మత వస్తుంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. Harlequin Ichthyosis‌ అనే రుగ్మత కారణంగా ఇలాంటి శిశువులు జన్మిస్తుంటారని వైద్యులు తెలిపారు. ABCA 12 జ‌న్యువులో జ‌రిగే ఉత్ప‌రివ‌ర్త‌న‌లే హ‌ర్లేక్విన్ ఇక్థియోసిస్ అనే రుగ్మ‌త‌కు దారితీస్తాయ‌ని చెప్పారు. ఈ పరిస్థితి శిశువులకు చాలా కఠినమైనదని వైద్యులు అంటున్నారు. మందపాటి చర్మం కలిగి ఉంటారని తెలిపారు. లోతైన పగుళ్ల ద్వారా వేరు చేయబడిన వజ్రాల ఆకారపు పలకలుగా చర్మం విభజించబడి ఉంటుందని వివరించారు. ఇటువంటి శిశువుల్లో ముఖ లక్షణాలు, నోరు, కళ్లు, చెవులు కూడా వికృతంగా కనిపిస్తాయి. ఇలా జన్మించిన పిల్లలు ఒకటి, రెండు రోజులు మాత్రమే జీవించగలరు.

ఇంతకు ముందు ఇండియాలో 2016లో మహారాష్ట్రలో ఇలాంటి ఒక కేసు నమోదైంది. నాగ్‌పూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఇలాంటి రుగ్మతతో బాధపడుతున్న ఓ శిశువు జన్మించింది. ఇండియాలో ఈ వ్యాధితో జన్మించిన తొలి శిశువు అని నమ్ముతారు. అయితే ఆ శిశువు ఎక్కువ కాలం జీవించలేపోయింది. పుట్టిన కొన్ని రోజులకే మృతిచెందింది.

First published:

Tags: New born baby, Odisha

ఉత్తమ కథలు