అంతర్జాతీయ మాతృదినోత్సవ వేళ ఓ అద్భుత దృశ్యం కనిపించింది. ఓ తల్లి ఒడికి తన బిడ్డలను చేర్చిన అమోఘ ఘట్టం ఆవిష్కృతమైంది. మానవత్వాన్ని పరిమళించే, జంతు ప్రేమను సాక్షాత్కరించే సందర్భం వెల్లివిరిసింది. శ్రీలంకలోని ఓ చోట ఏనుగులు, ఇతర జంతువులు పంట పొలాల్లోకి చేరి నాశనం చేస్తున్నాయని గుంతలు తవ్వారు. అయితే, ఆ గుంతలు తల్లీబిడ్డలను వేరు చేస్తాయని ఊహించలేకపోయారు. ఆ చోటుకు వచ్చిన రెండు ఏనుగు పిల్లలు ఆ గుంతలో పడి గిలగిల కొట్టుకున్నాయి. వాటిని కాపాడుకోవడానికి తల్లి ఏనుగులు విశ్వప్రయత్నాలు చేశాయి. మూడు గంటల పాటు తీవ్రంగా శ్రమించాయి. అయినా ఫలితం లేకపోయింది. అప్పుడే ఆ దిశగా వచ్చిన అటవీ శాఖ అధికారులు వాటిని చూడగా అసలు విషయం తెలిసింది. ఆ గుంత నుంచి ఆ ఏనుగులను బయటకు తీసేందుకు ప్రొక్లెయిన్‌ను రప్పించారు. దాని సహాయంతో గుంత చుట్టూ మట్టిని తవ్వి ఆ ఏనుగులు బయటికి వచ్చేలా చేశారు.
విశేషమేమిటంటే.. గుంత నుంచి బయటకు వచ్చిన మొదటి ఏనుగు భయంతో పరుగెత్తగా, రెండో ఏనుగు బయటికి వచ్చి పారిపోకుండా అక్కడే ఆగి, కృతజ్ఞతలు చెబుతున్నట్లు గాండ్రిస్తూ తొండంతో ఆడించింది. ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. వీడియోను చూసి ఏనుగు కృతజ్ఞతను కొనియాడుతున్నారు. మనుషులకే కాదు జంతువులకూ గొప్ప మనసు ఉంటుందని ప్రశంసిస్తున్నారు.
Two baby elephants that had fallen into a pit are rescued in Sri Lanka pic.twitter.com/TdPM3yn8wh
— Reuters Top News (@Reuters) May 8, 2019
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elephant attacks, Forest, Sri Lanka