• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • BABY ELEPHANT SLIDING DOWN A HILL SLOPE FOR FUN WATCH VIRAL VIDEO

Viral Video: జారుడు ఆటను తెగ ఎంజాయ్ చేస్తున్న గున్న ఏనుగు

Viral Video: జారుడు ఆటను తెగ ఎంజాయ్ చేస్తున్న గున్న ఏనుగు

జారుడు ఆటతో ఎంజాయ్ చేస్తున్న గున్న ఏనుగు

పిల్లలు జారుడు ఆట ఆడుతుంటే మనకు కూడా చిన్ననాటి తీపి స్మృతులు గుర్తుకు వస్తాయి. ఓ గున్న ఏనుగు జారుడు ఆటతో ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
    చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన ఆటల్లో జారుడు బల్లకు ప్రత్యేక స్థానం ఉంటుంది. పిల్లలు జారుడు బల్ల ఆడుతుండటం  చేస్తే...ఎవరికైనా తమ చిన్ననాటి తీపి స్మృతులు గుర్తుకు వచ్చేస్తాయి. ఇక నేరుగా విషయానికి వస్తే ఓ గున్న ఏనుగు...జారుడు ఆటాడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ ఇండియర్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ఈ వీడియోను షేర్ చేశారు. జారుడు ఆటను ఎంజాయ్ చేయడం చిన్నపిల్లల జీన్స్‌లోనే ఉంటుందని కామెంట్ పెట్టారు. ఈ వీడియోలో ఓ గున్న ఏనుగు జారుడు ఆటను ఎంజాయ్ చేస్తోంది. వీడియో నెటిజన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. మనుషులైనా...జంతువులైనా పిల్లలు పిల్లలే అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. వచ్చే జన్మలో తాను ఏనుగై పుట్టాలనుకుంటున్నట్లు మరో నెటిజన్ సరదా కామెంట్ చేశారు.



    ప్రకృతి ఒడిలో ఎలాంటి కళ్మషం లేని ఎంజాయ్‌మెంట్ అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
    First published:

    అగ్ర కథనాలు