Home /News /trending /

BABY ELEPHANT EMBRASSED MODEL LIFTING SKIRT WHILE PLAYING PVN

Viral Video : పిల్ల ఏనుగు కుర్ర చేష్టలు..అమ్మాయిని కింద పడేసి స్కర్ట్ పైకి లేపి చూస్తోంది

పిల్ల ఏనుగు చర్యతో అవాక్కయిన మోడల్

పిల్ల ఏనుగు చర్యతో అవాక్కయిన మోడల్

ఓ పిల్ల ఏనుగు చేసిన కుర్ర చేష్టాలకు ఓ మోడల్ కు కొద్దిసేపు నవ్వాలో,ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. పిల్ల ఏనుగు కుర్ర చేష్టాలకు సంబంధించిన ఫోటోలు,వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పిల్లల చర్యలు కొన్నిసార్లు చక్కిలిగింతలు పెడతాయి, కొన్నిసార్లు ఇబ్బంది పెడతాయి. మానుషుల పిల్లల మాదిరే జంతువుల పిల్లలు కూడా .జంతువుల పిల్లలు కూడా చాలా సార్లు అందమైన రౌడీలుగా ప్రవర్తిస్తాయి. తాజాగా ఓ పిల్ల ఏనుగు చేసిన కుర్ర చేష్టాలకు ఓ మోడల్ కు కొద్దిసేపు నవ్వాలో,ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఎదురైంది. పిల్ల ఏనుగు(Baby elephant) కుర్ర చేష్టాలకు సంబంధించిన ఫోటోలు,వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.

వైరల్ అవుతున్న వీడియోలో...మేగన్ మిలన్(Megan Milan)అనే మోడల్ అభయారణ్యంలోని ఏనుగుల దగ్గర నిలబడి ఉంది. హాయిగా ఏనుగుల గుంపు పక్కన నిలబడి ఫోటోకి పోజులిచ్చింది. అయితే ఈ సమయంలో ఏనుగుల గుంపులో ఉన్న మూడు వారాల వయస్సు ఉన్న ఓ పిల్ల ఏనుగు..మేగన్ మిలన్ తో ఆడుకునేందుకు ప్రయత్నించింది. తన పక్కనే నిలబడ్డ మోడల్ మేగన్ మిలన్ స్కర్ట్ పట్టుకొని లాగడం ప్రారంభించి ఆ పిల్ల ఏనుగు. ఒక్కసారిగా ఏనుగు పిల్ల మేగాన్ స్కర్ట్‌ను పైకి లేపింది. పిల్ల ఏనుగు కుర్ర చేష్టలకు నవ్వాలో,ఏడవాలో తెలియక మేగన్ అక్కడి నుంచి వచ్చేసేందుకు ప్రయత్నించగా..ఆ పిల్ల ఏనుగు మేఘన్ ను మాత్రం వదిలిపెట్టలేదు. ఆమె ధరించిన స్కర్ట్ పట్టుకుని వదలకుండా ఆటలాడింది. మేగాన్‌ను కింద పడేలా చేసి ఆమెపైకి ఎక్కింది. అయితే తాను ఆడుకుంటున్నారని పిల్ల ఏనుగు అనుకుంటుండగా...నాకెక్కడ దొరికిందిరా బాబు ఇది మేగన్ అనుకుంటుండగా...సకాలంలో పెద్ద ఏనుగు ఆ పిల్ల ఏనుగుని మహిళకు దూరంగా పక్కకు లాక్కెళ్లింది.

ఈ తతంగమంతా మేగన్‌తో కలిసి అభయారణ్యంలోకి వెళ్లిన వ్యక్తి కెమెరాలో రికార్డ్ చేశారు. పిల్ల ఏనుగు మేగన్ తో ఆటలాడుతున్న సమయంలో చాలా మంది నవ్వుతున్న శబ్దం వీడియోలో వినిపిస్తోంది. ఈ సరదా సంఘటన కు సంబంధించిన వీడియో క్లిప్‌ను స్వయంగా మేగన్ తన టిక్‌టాక్ ఖాతాలో,ఇన్ స్టాగ్రామ అకౌంట్ లో షేర్ చేసింది. ఈ ఫన్నీ వీడియోని ప్రజలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. వీడియోకి ఇప్పటివరకు పన్నెండు మిలియన్ల వీక్షణలు వచ్చాయి. టిక్‌టాక్‌లో మెగాన్‌కు మొత్తం 2.5 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆ పిల్ల ఆడటానికి ప్రయత్నిస్తున్నట్లు నెటిజన్లు ఫన్నీగా ట్వీట్స్ చేస్తున్నారు.




Shocking : తనకన్నా 15 ఏళ్లు చిన్నవాడైన అల్లుడితో అత్త ఎఫైర్..చివరికి ఇద్దరూ ఉరేసుకొని ఆత్మహత్య!

మరోవైపు,ప్రమాదం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. చెట్టుపైన పడి చనిపోవడానికి భయపడి ఇంట్లో కూర్చున్న వ్యక్తి.ఇంటిపై చెట్టు పడటంతో ఇళ్లు కూలి మృతిచెందాడని మన పెద్దలు పాత కథ ఒకటి చెబుతుంటారు. మనం మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయి. చాలా విషయాలు మనిషి నియంత్రణకు మించినవి. మనం అస్సలు ఊహించని లేదా అంతకంటే ఎక్కువ ఆశ్చర్యకరమైన సంఘటనలు మనచుట్టూ నిత్యం జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ విచిత్రమైన యాక్సిడెంట్ లో ఓ యువతి చావు అంచులదాకా వెళ్లి వచ్చింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక మహిళ పెద్ద గుండ్రని కొబ్బరికాయ అకస్మాత్తుగా ఆమె తలపై పడటంతో తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. మలేషియాలోని జలాన్ తెలుక్ కుంబార్ అనే పట్టణంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Elephant, Elephant attacks, Viral Video

తదుపరి వార్తలు