డ్రాగన్ల జననం... గుహలో ఉంచిన శాస్త్రవేత్తలు... వైరల్ వీడియో

డ్రాగన్లనేవి అసలు లేవనీ... అంతా ఊహ మాత్రమే అని అనుకునేవారు. కానీ డ్రాగన్ల జాతి జీవులను నిజంగానే ప్రపంచానికి చూపించారు శాస్త్రవేత్తలు.

news18-telugu
Updated: July 14, 2020, 9:07 AM IST
డ్రాగన్ల జననం... గుహలో ఉంచిన శాస్త్రవేత్తలు... వైరల్ వీడియో
డ్రాగన్ల జననం... గుహలో ఉంచిన శాస్త్రవేత్తలు... వైరల్ వీడియో (credit - Youtube)
  • Share this:
చైనా పురాణాల్లో... పిల్లల పుస్తకాల్లో మాత్రమే కనిపించే డ్రాగన్ జీవులు నిజంగానే ఉన్నాయని తేలింది. ఈ ప్రపంచం అద్భుతమైనదని మరోసారి నిరూపించింది. ఐతే... చైనా పురాణాల్లో ప్రజలను రక్షిస్తూ... గాల్లో ఎగురుతూ... నోటి ద్వారా నిప్పులు కక్కే డ్రాగన్లు ఇవి కావు. ఇవి ఒకరకరమైన సాలమండర్లు. ఎంతో పురాతనమైన డ్రాగన్ల జాతికి చెందినవి. అచ్చం చైనా డ్రాగన్లలాగానే ఉంటాయి. స్లొవేనియాలోని పోస్తోజ్నా గుహలో వీటిని గుర్తించారు. ఆడ సాలమండర్... 2016లో ఓ ఎక్వేరియంలో మొత్తం 64 గుడ్లు పెట్టింది. వాటిని ల్యాబ్‌కి తరలించి పొదిగించారు. వాటిలో 22 పిల్లలయ్యాయి. వాటిలో కొన్ని మాత్రమే బతికాయి. నాలుగేళ్లుగా ఆ జీవులను జాగ్రత్తగా గుహలోని నీటిలో ఉంచారు. వాటిని అప్పుడప్పుడూ గుహ సిబ్బంది గమనించేవాళ్లు. ఇప్పుడు ఆ గుహను పర్యాటకుల కోసం తెరుస్తున్నారు. రోజూ 30 మందిని అనుమతిస్తున్నారు. బేబీ డ్రాగన్లను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.

ఈ జీవులు 100 ఏళ్ల దాకా బతకగలవు. తమ జీవితమంతా నీటిలోనే ఉంటాయి. గుహలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆక్వేరియంలో మూడు పిల్లల్ని పర్యాటకులు చూసేందుకు ఉంచారు. కొన్ని శతాబ్దాలుగా ఈ గుహకు బయోడైవర్శిటీ పరంగా మంచి పేరుంది. ఇక్కడ రకరకాల జీవులు పుట్టగలుగుతున్నాయి. వాటిలో ఈ బేబీ డ్రాగన్లు అద్భుతం అంటున్నారు సైంటిస్టులు.


ఇవి భూమిపైకి రావడం ఎంతో ఆనందం కలిగిసతోందని ఈ డ్రాగన్లను పుట్టించిన ల్యాబ్ నిర్వాహకుడు కట్జా డోలెంక్ తెలిపారు. గుడ్లను జాగ్రత్తగా ఉంచుతూ... ఎంతో బాధ్యతగా మెలిగినట్లు ఆయన తెలిపారు. తమ కృషికి తగిన ఫలితం ఇప్పుడు దక్కుతోందని అంటున్నారు.
Published by: Krishna Kumar N
First published: July 14, 2020, 9:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading