హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral Video: అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాన్ని చూసి ఆ మహిళకు గుండె ఆగినంత పనయింది..!

Viral Video: అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాన్ని చూసి ఆ మహిళకు గుండె ఆగినంత పనయింది..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటి ముందున్న సెక్యూరిటీ కెమెరాలో రికార్డయిన ఓ షాకింగ్ దృశ్యం ఆ మహిళకు కనిపించింది. ఆ వీడియోలో ఏమున్నదో చూసి ఆమె వెన్నులో వణుకుపుట్టింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

ఓ మహిళ తన ఇంటి ముందు ఓ సెక్యూరిటీ కెమెరాను ఏర్పాటు చేసుకుంది. వీలున్నప్పుడల్లా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించేది. వారానికి ఓ సారి అయినా తీరగ్గా ఒక్కో వీడియోను ఓపిగ్గా చూసేది. అలా చూస్తున్న సమయంలోనే ఓ షాకింగ్ దృశ్యం ఆ మహిళ కంట పడింది. తెల్లవారుజామున 3గంటల 40 నిమిషాల సమయంలో ఆ సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యం చూసి ఆ మహిళ వెన్నులో వణుకుపుట్టింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది? ఆ సీసీటీవీ ఫుటేజీ అసలు కథేంటంటే. అమెరికాలో రియాన్ అనే మహిళ ఫ్లోరిడా రాష్ట్రంలో నివసిస్తోంది. అమెరికాలో సెక్యూరిటీ విషయంలో ఎలాంటి నిబంధనలు ఉంటాయో అందరికీ తెలిసిందే. మెజారిటీ ఇళ్లల్లోనూ, ఇళ్ల ముందు సెక్యూరిటీ కెమెరాలను ఫిక్స్ చేసి ఉంచుకుంటారు. వీటిని పర్యవేక్షించడానికి ప్రత్యేక ఏజెన్సీలు కూడా ఉంటుంటాయి.

ఫ్లోరిడాలో ఉంటున్న రియాన్ తన ఇంటి ముందున్న సీసీటీవీలో రికార్డయిన వీడియోలను అప్పుడప్పుడు చూసేది. ఇటీవల ఓ వారాంతంలో ఆ వీడియోలను చూడటం మొదలు పెట్టింది. ఏప్రిల్ 15వ తారీఖున తెల్లవారుజామున, అంటే ఏప్రిల్ 14 అర్ధరాత్రి దాటిన తర్వాత తన ఇంటి ముందున్న సెక్యూరిటీ కెమెరాలో ఓ షాకింగ్ దృశ్యం కనిపించింది. ఆ వీడియోలో ఓ జంతువు అత్యంత వేగంగా దూసుకెళ్లినట్టు గుర్తించింది. అది ఓ బేబీ డైనోసార్ అని ఆమె అభిప్రాయపడింది. దీంతో ఈ వీడియో క్లిప్ ను కట్ చేసి తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్స్ చేస్తున్నారు.

అదొక పక్షేమో అని కొందరు అనుకుంటోంటే, కాదు కుక్క అనీ, వేరే జంతువేమో అని చెబుతున్నారు. డైనోసార్ అయి ఉండదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆమె మాత్రం అది డైనోసారే అని నిక్కచ్చిగా చెబుతోంది. మరి ఆ వీడియోను మీరు కూడా ఓ లుక్కేయండి.

First published:

Tags: Trending news, Trending videos, Viral dialogues, VIRAL NEWS, Viral tweet

ఉత్తమ కథలు