వైరల్ వీడియో... ఏనుగును హడలెత్తించిన దూడ... ఆ తర్వాత జరిగిందో అద్భుతం...

Viral Video : అసలే ఏనుగులకు కోపం ఎక్కువ. తిక్కరేగితే... కాలితో ఒక్కటిస్తాయి. అలాంటి ఏనుగు జోలికి వెళ్లిందో దూడ (పెయ్య). అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: March 7, 2020, 9:31 AM IST
వైరల్ వీడియో... ఏనుగును హడలెత్తించిన దూడ... ఆ తర్వాత జరిగిందో అద్భుతం...
ఏనుగును హడలెత్తించిన దూడ... (credit - twiiter - Nature is Lit)
  • Share this:
Viral Video : ప్రకృతిలో కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. వాటిని చూసి మనం ఆనందపడొచ్చు. అలాంటి దృశ్యం ఒకటి కెమెరా కంటికి చిక్కింది. ఆ దూడ (పెయ్య)కు అస్సలు భయం లేదు. తన కంటే ఐదు రెట్లు పెద్దగా ఉన్న ఎనుగును భయపెట్టి, బెదిరించి, హడలెత్తింది... వెనక్కు అడుగులు వేసేలా చేసింది. నిజానికి ఆ ఏనుగు తలచుకుంటే... ఆ దూడను తన తొండంతోనో, కాలుతోనో ఒక్కటివ్వగలదు. కానీ... ఆ ఏనుగుకి... దూడపై జాలి కలిగి... ఏమీ అనకుండా వెనక్కి వెళ్లసాగింది. ఐతే... దూడకి ఏనుగు సంగతి తెలియకపోవచ్చు... దాని తల్లైన గేదెకి తెలుసు కదా... అందుకే... "అమ్మో... నా పిల్ల.... ఏనుగు జోలికి వెళ్తోంది... ఇంకేమైనా ఉందా" అనుకుంటూ... ఆ లేగ దూడను ఆపేందుకు వెనకాలే పరిగెత్తింది. లక్కీగా ఏనుగు ఏమీ చెయ్యలేదు... పైగా... తనే పారిపోయింది. గజరాజు తన పెయ్య జోలికి రాకపోవడంతో... తల్లి ఎంతో ఆనందపడింది. ప్రాణం లేచొచ్చినట్లు ఫీలైంది.


ఇంత అద్భుతమైన వీడియో వైరల్ కాకుండా ఉంటుందా? నేచర్ ఈజ్ లిట్ (Nature is Lit) అకౌంట్... ట్విట్టర్‌లో ఈ వీడియోని మార్చి 4న అప్‌లోడ్ చేసింది. ఇప్పటివరకూ దీన్ని 1.37 లక్షల మంది చూశారు. దాదాపు 10 వేల మంది లైక్ చేశారు. 2వేల మంది రీట్వీట్ చేశారు. 172 మంది కామెంట్స్ రాశారు. అందరూ ఇది చూసి వావ్ అంటున్నారు. ఆ ఏనుగును మెచ్చుకుంటున్నారు. ఇంత మంచి వీడియో ఈ మధ్యకాలంలో చూడలేదంటున్నారు. మరి 17 సెకండ్ల అద్భుతాన్ని మీరూ చూసేయండి.

First published: March 7, 2020, 9:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading