అరుదైన ఘటన...విమానంలో పురుడుపోసుకున్న మగబిడ్డ...పేరేంటో తెలుసా?

విమానం 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఓ గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలస్కాలో ఈ ఘటన చోటు చేసుకోకుంది.

news18-telugu
Updated: August 13, 2020, 9:06 PM IST
అరుదైన ఘటన...విమానంలో పురుడుపోసుకున్న మగబిడ్డ...పేరేంటో తెలుసా?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విమానంలో ఆస్పత్రికి వెళ్తుండగా ఓ గర్భిణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అలస్కాలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకోకుంది. ఆకాశంలో  జన్మించినందున ఆ మగ బిడ్డకు స్కై(Sky) అని నామకరణం చేశారు. 35 వారాల గర్భిణిగా ఉన్న క్రిస్టల్ హిక్స్...పురిటి కోసం తమ ప్రాంతం నుంచి సమీపంలోని ఆస్పత్రిలో చేరేందుకు విమానంలో బయలుదేరింది. విమానం బయలుదేరిన వెంటనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఏమీ కాదనకున్నా..ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె విమానంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. సుఖ ప్రసవం కావడంతో విమానంలోని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయ్యాక...ఆమెను, బిడ్డను సురక్షితంగా ఆస్పత్రికి తరలించారు. కొన్ని వారాలు ముందుగానే జన్మించడంతో బిడ్డను ఇంక్యుబేటర్‌లో ఉంచారు. బిడ్డ క్షేమంగా ఉందని...వచ్చే వారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

అనూహ్యంగా ఆకాశంలో జన్మించినందున ఆ బుడ్డడికి స్కై అని నామకరణం చేసినట్లు క్రిస్టల్ హిక్స్ తెలిపారు. విమానంలో తనకు ఎదురైన అనుభవం...ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పింది. విమానంలో ప్రసవించినందుకు మొదట్లో కాస్త ఇబ్బందిపడ్డా...సహ ప్రయాణీకులందరూ తన బిడ్డ గురించే మాట్లాడుకోవడం చూసి సంతోషించినట్లు తెలిపింది. స్కై జన్మించినప్పుడు విమానం 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తోందని...అయితే తన బిడ్డకు జన్మస్థలం ఆకాశమని రాయించలేనని, ఆస్పత్రిలో చేరిన ప్రాంతాన్ని జన్మస్థలంగా రికార్డుల్లో రాయిస్తానని చెప్పింది. క్రిస్టల్ హిక్స్‌కు ఇప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నారు. స్కై‌తో ఆడుకునేందుకు వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Published by: Janardhan V
First published: August 13, 2020, 8:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading