Home /News /trending /

BABA VANGA 2022 PREDICTIONS ALIEN ATTACK NEW VIRUS LIKELY SAYS BULGARIAN BLIND PSYCHIC MKS

Baba Vanga: 2022 మరింత భయానకం.. బాబా వాంగ గతంలో చెప్పినవన్నీ జరిగాయి!

బాబా వాంగ

బాబా వాంగ

బాబా వాంగ అంచనాల ప్రకారం 2022లో గ్రహాంతరవాసులు భూమిపై దండయాత్ర చేస్తారు. ‘ఓమువామువా’ అనే గ్రహశకలం భూమిపై జీవం కోసం వస్తుంది. ఈ ఏడాది మానవాళికి మరింత భయానకంగా ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, సునామీ, ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి..

ఇంకా చదవండి ...
జరిగిపోయినదాన్ని, జరుగుతున్నదానినే కాదు, జరగబోయేదానినీ ఎవరూ ఆపలేరని అన్నారు బల్గేరియన్ బ్లైండ్ బాబా వాంగా. అంధురాలైన ఆమె తన అతీంద్రియ శక్తులతో అంచనా వేసి చెప్పిన చాలా విషయాలు అచ్చంగా జరిగాయి. రెండో ప్రపంచ యుద్దం నుంచి 2004 సునామీ దాకా, అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత నుంచి 2018నాటికి చైనా సూపర్ పవర్ అవుతుందనే అంచనాదాకా ఆమె చెప్పిన జ్యోస్యాల్లో దాదాపు 70 శాతం నిజమయ్యాయి. ఒమిక్రాన్ గుబులుతో 2022లోకి అడుగుపెట్టబోతోన్న మానవాళికి కొత్త ఏడాదిలో మరిన్ని భయానక అనుభవాలు తప్పవని చెప్పారామె. బల్గేరియాకు చెందిన వాంజెలియా ప్యాండెవా గుస్తెరోవా అలియాస్ బాబా వాంగ.. 2022కు సంబంధించి, భారత్ గురించీ ఆమె చెప్పిన విషయాలు గగుర్పాటుకు గురిచేసేలా ఉన్నాయి..

సైబీరియా నుంచి కొత్త వైరస్..
బాబా వాంగ అంచనాల ప్రకారం 2022 సంవత్సరం మానవాళికి మరింత భయానకంగా ఉండబోతోంది. ఆమె లెక్క ప్రకారం.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు, సునామీ, ఇతర ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా మరియు అనేక ఆసియా దేశాలలో వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాల పెరుగుదల ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. సైబీరియా నుంచి ప్రాణాంతకమైన వైరస్ వస్తుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో వైరస్‌లు విజృంభిస్తాయి. నీటి కొరత. జనాభా..కాలుష్యం పెరుగుతున్నందున, చాలా మంది ప్రజలు సరైన తాగునీరు కోసం కష్టపడతారు.

Siblings : అయ్యో.. అన్నాచెల్లెలూ మిగల్లేదు.. వాళ్ల కుటుంబానికి జరిగింది తెలిస్తే తట్టుకోలేరు!భూమిపై ఏలియన్స్ దాడి..
2022లో గ్రహాంతరవాసులు భూమిపై దండయాత్ర చేస్తారు. ‘ఓమువామువా’ అనే గ్రహశకలం భూమిపై జీవం కోసం వస్తుంది. అందులోని గ్రహాంతరవాసులు మన నగరాలపై బాంబులతో దాడి చేసి, మానవులను ఖైదీలుగా పట్టుకోవచ్చు. అంగారకునిపై మానవుల కాలనీ ఏర్పడుతుంది.. ఇది అణ్వాయుధ దేశంగా పెరిగి 2170 తర్వాత భూమి నుంచి స్వాతంత్రం పొందడానికి ప్రయత్నిస్తుంది. ప్రజలు స్క్రీన్‌ల ముందు మరింత ఎక్కువ సమయం గడుపుతారు. చాలామంది వాస్తవ దృశ్యాలకు వర్చువల్ రియాలిటీకి మధ్య గందరగోళానికి గురవుతారు.

peddapalli : పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి.. ఆస్పత్రి బాత్రూమ్‌లో ఎందుకమ్మా అలా చేశావ్!భారత్ లో కరువు..
మిడతల దాడి భారతదేశంలో పంటలపై దాడి చేసి కరువును కలిగిస్తుంది. భూ ప్రపంచంపై డ్రాగన్‌ చైనా ఆధిపత్యం సాధిస్తుంది. మానవత్వం మరచి ప్రవర్తించే ఈ డ్రాగన్‌కు వ్యతిరేకంగా మూడు పెద్ద శక్తులు ఏకం అవుతాయి. వాతావరణ మార్పుల కారణంగా మానవజాతి తీవ్ర కరువు బారిన పడుతుంది. ప్రజలు బీటిల్స్, ఆకులు, మట్టిని తిని చనిపోతారు. మంచుకొండల్లోని హిమనీనదాల్లో ప్రాణాంతక వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొంటారు. ఇది వేగంగా వ్యాపించి భారీగా మానవుల, జంతువుల మరణాలకు కారణమవుతుంది. అని బాబా వాంగ అంచనా వేశారు.

rtc bus : కదులుతోన్న ఆర్టీసీ బస్సులో మంటలు.. నడిరోడ్డుపైనే కాలి బూడిదైంది.. videoఎవరీ బాబా వాంగ?
బల్గేరియాలోని పెట్రిచ్‌లో 1911, జనవరి 31న బాబా వాంగ జన్మించారు. ఈమె 1996 ఆగస్టు 11న (84ఏళ్ల వయసున్నప్పుడు) మరణించారు. తన 12వ ఏట ఓ టోర్నడోలో కొట్టుకుపోయినా, ప్రాణాలతో వాంగ బయటపడ్డారు. బాబా వాంగ కళ్లలో ఇసుక పడటంతో చూపు కోల్పోయారు. ఈమె తన 16వ ఏట నుంచే భవిష్యవాణి మొదలుపెట్టారు. తండ్రి గొర్రెల మందను దొంగలు ఎత్తుకెళతారనే ఆమె మొదటి జోస్యం. 30 ఏళ్ల వయసుకే ఆమె అతీంద్రియ శక్తులు పెరిగి, ‘నోస్ట్రడామస్‌ ఆఫ్‌ ద బాల్కన్స్‌’గా జనం పిలిచుకునే స్థాయికి చేరింది.

Actress suicide : డ్రగ్స్ కేసు భయంతో.. యువ నటి ఆత్మహత్య.. కానీ వాళ్లు ఫేక్ NCBహిట్లర్ పిలిపించుకోగా..
అసలే సెంటిమెంట్లను బలంగా నమ్మిన జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్‌ ఓసారి బాబా వాంగాను పిలిపించుకొని భవిష్యవాణి చెప్పించుకున్నారని, ఆ విషయం ముందుగానే పసిగట్టి ఆమె దొరక్కుండా దాక్కున్నారని ప్రచారంలో ఉంది. 1996లో చనిపోవడానికి ముందే రాబోయే వందేళ్లకు సంబంధించిన జ్యోతిషాన్ని చెప్పారామె. సిరియాలో ‘గ్రేట్‌ ఇస్లామిక్‌ వార్‌’ మొదలై 2043 నాటికి రోమ్‌పై పూర్తి ఆధిపత్యం సాధిస్తుందనీ ఆమె చెప్పారు.
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, New Year 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు