Bulgaria Vanga Baba : ఈ ప్రపంచం అంతమైపోతే... 2012 సినిమాలో చూపించినట్లు... అల్లకల్లోలమైపోతే ఎలా ఉంటుంది? అని ఆలోచించేవాళ్లు చాలా మంది మన భూమిపై ఉన్నారు. ఇలాంటి ఆలోచనలకు ఓ పేరు కూడా తయారైంది. అదే యుగాంతం. ఇంగ్లీష్‌లో డూమ్స్ డే. ఐతే... వంగా బాబా(మాత)ను ఈ లిస్టులో వెయ్యలేం. ఎందుకంటే... ఆమె భవిష్యత్తు గురించి చెప్పింది ఇప్పుడు కాదు ఎప్పుడో 50 ఏళ్ల కిందటే. ఆమె అసలు పేరు వంగోలియా పాండేవ్ దిమిత్రోవా. 1911లో పుట్టారు. 1966లో చనిపోయారు. ఇదంతా రొటీన్. ఐతే... 12 ఏళ్ల వయసులో వంగా తన కంటి చూపును కోల్పోయారు. అప్పుడామె పర్వతాల చెంతకు వెళ్లి తన అంతర్గత శక్తులను చైతన్య పరచుకున్నారు. ఫలితంగా ఆమె నోస్ట్రడామస్ (ఆయనో భవిష్యవేత్త) లాగా భవిష్యత్తును ముందే ఊహించే శక్తి వచ్చినట్లు ఫీలయ్యారు. ఆమె ఏదేదో చెబుతుంటే... అంతా ఆసక్తిగా విన్నారు. వాటిలో కొన్ని జరిగాయి. ఫలితంగా ఆమెకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రజలు నమ్మారు. తాజాగా ఆమె... 2020లో ఏం జరుగుతుందో కూడా అప్పట్లోనే చెప్పారు. ఆమె ఏం చెప్పారన్నదానిపై ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది.
వంగ బాబా ప్రకారం 2020లో ముస్లింలు జోరందుకుంటారు. తమ గళాన్ని గట్టిగా వినిపిస్తారు. యూరప్‌లో కెమికల్ ఎటాక్స్ జరుగుతాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రాణహాని తప్పదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాధుల బారిన పడతారు. 2020లో ప్రపంచమంతా చాలా చెడు ఘటనలు జరుగుతాయి. లేనిపోని సమస్యలు వస్తాయి. ప్రజల ప్రవర్తనలో మార్పులొస్తాయి. 2020లో మతపరమైన కల్లోలాలు చెలరేగుతాయి. ఇండియాలో కూడా ఇలా జరుగుతుందని వంగ బాబా ఊహించారు. అంతేకాదు... 2020లో ప్రజలు మానవత్వాన్ని మరిచిపోతారట. పెట్రోలు వాడకం తగ్గి... సోలార్ పవర్ వాడకం బాగా పెరుగుతుందట. 2020లో రష్యా, భారత్, చైనా మరింత పవర్ఫుల్ అవుతాయని వంగ బాబా అప్పుడే చెప్పారు.
నోస్ట్రడామస్ లాగా వంగ బాబా ప్రపంచం అంతమైపోతుందని చెప్పలేదు గానీ... అల్లకల్లోలం అవుతుందని మాత్రం చెప్పారు. ఆమె చెప్పింది మనం నమ్మాలా అంటూ చాలా మంది పరిశోధకులు... ఆమె ఏం చెప్పారు? వాటిలో ఎన్ని జరిగాయి? అన్నీ లెక్కలేశారు. చివరకు ఆమె చెప్పిన వాటిలో 80 శాతం కరెక్టుగా జరిగాయని తేల్చారు. సో.. 2020లో మనం జాగ్రత్తగా ఉంటూ... మానవత్వంతో మెలిగితే... అందరికీ మంచిదే.
Video : అమ్మో... పాలలో ఏం కలిపేస్తున్నాడో చూశారా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, India news, National News, News online, News today, News updates, Telugu news, Telugu varthalu