Viral Video: ఇదేం విచిత్రం.. మొక్కలు ఇలా కూడా పెరుగుతాయా? మీరెప్పుడూ చూసి ఉండరు

ప్రతీకాత్మక చిత్రం

విత్తనం మొలకెత్తాలన్నా.. అది మొక్కై ఎదగాలన్నా.. సూర్యరశ్మి తప్పకుండా ఉండాలి. వెలుతురు, ఎండ లేకుండా మొక్కలు బతకడం కష్టం. కానీ ఓ అవకాడో మొక్క మాత్రం.. నాకు సూర్యుడితో పనిలేదని నిరూపించింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • Share this:
విత్తనం నుంచి మొక్క మొలవాలన్నా, పెరగాలన్నా మట్టి, నీరు, సూర్యరశ్మి వంటివి కావాలి. ఈ విషయం మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. అయితే ఓ అవకాడో విత్తనం మాత్రం నేను చాలా డిఫరెంట్‌ అని నిరూపించింది. ఇతర విత్తనాలకు నాకు అస్సలు పోలిక పెట్టొద్దు... నా దారి వేరే దారి అని నిరూపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. చెల్సియా అనే యువతి టిక్‌టాక్‌లో ఈ వీడియో పోస్ట్‌ చేసింది. ఆ తర్వాత వివిధ యూట్యూబ్‌ ఛానల్స్‌లో ఆ వీడియో వైరల్‌ అయ్యింది. ఇంతకీ ఏమైందంటే...

చెల్సియా కొన్ని నెలల క్రితం ఓ అవకాడో విత్తనాన్ని తీసుకొచ్చింది. హోం గార్డెనింగ్‌ కోసం ఆ విత్తనాన్ని సీసాలో పెట్టింది. అయితే కొన్ని కారణాల వల్ల నాలుగు నెలలు వేరే ప్రాంతానికి వెళ్లింది. ఇంట్లో ఓ గదిలో ఆ సీసాను ఉంచేసింది. అయితే నాలుగు నెలల తర్వాత తిరిగి వచ్చిన ఆ విత్తనం ఉన్న సీసాను చూసి ఆశ్చర్యానికి గురైంది చెల్సియా. కారణం ఆ విత్తనం మొలకెత్తడం ప్రారంభించింది. అందులో కొత్తేం ఉంది. ఏ విత్తనం అయినా అన్ని రోజులు ఉంచితే మొలకెత్తుతుంది కదా అంటారా. అయితే విత్తనం మొలకెత్తడానికి సూర్యరశ్మి కచ్చితంగా ఉండాలనే విషయం తెలిసిందే కదా. కానీ ఆ సీసాపై ఎలాంటి సూర్యరశ్మి లేకుండా అవకాడో సీడ్ మొలకెత్తింది.

Video: మొబైల్ ఎత్తుకుపోయిన చిలుక!.. చివరకు ఏం జరిగిందంటే..

ఖాళీ సీసాలో మొలకెత్తిన అవకాడో విత్తనాన్ని చూసి ఆశ్చర్యానికి గురైన చెల్సియా ఆ ఆనందాన్ని వీడియో రూపంలో టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఆ వీడియోలో చూపించిన దాని ప్రకారం నాలుగు నెలల్లో ఆ విత్తనం మొలకెత్తి అపార్ట్‌మెంట్‌ రూఫ్‌కి తాకేంతలా పెరిగిందట. ఆ వీడియోతోపాటు చెల్సియా రాసిన ట్యాగ్‌లైన్‌ కూడా ఆసక్తికరంగా ఉంది. ‘ఫైన్‌, నా సూర్యుడిని నేనే వెతుక్కుంటా’ అనే అర్థం వచ్చేలా టిక్‌టాక్‌ వీడియోలో రాసింది చెల్సియా. అంటే నా సూర్యరశ్మిని నేనే సంపాదించుకుని ఎదిగా అని అవకాడో చెప్పినట్లుగా ఉంది. దాంతోపాటు నో సన్‌ = నో లీవ్స్‌ = నో క్లోరోఫిల్‌ అని కూడా రాసుకొచ్చింది చెల్సియా.


Shocking Video: షర్ట్ జేబులో కాలిపోయిన మొబైల్..!

ఈ వీడియోకు సోషల్‌ మీడియాలో రకరకాల కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. కొంతమంది ఆశ్చర్యపోతున్నారు సూర్యరశ్మి లేకుండా మొక్కల ఎలా పెరిగిందబ్బా అని ఆలోచిస్తుననారు. ఇంకొంతమంది ఇందులో పెద్ద కొత్తదనం ఏముంది? చాలా సార్లు చూశామని కామెంట్స్ చేస్తున్నారు. మా ఇంట్లో, మా స్నేహితుల ఇళ్లలో ఇలా జరిగిందని చెబుతున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. ఈ వీడియో మాత్రం టిక్‌టాక్‌లో వైరల్‌గా మారింది.
Published by:Shiva Kumar Addula
First published: