Autodriver shares son 12th marksheet : కరోనా(Covid) కారణంగా గత రెండేళ్లుగా పిల్లల చదువులు బాగా దెబ్బతిన్నాయి. కరోనా కారణంతో దెబ్బతిన్న పిల్లల చదువులు ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిలో పడుతున్నాయి. ఈ ఏడాది 10,12వ తరగతి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఇతర రాష్ట్రాలలో కూడా 10,12వ తరగతి ఫలితాలు విడుదలవుతున్నాయి. వీటిలో భాగంగా మహారాష్ట్రలో కూడా 12వ తరగతి ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అయితే ఓ ఆటో డ్రైవర్ కొడుకు(Auto Driver Son) 12వ తరగతి ఫలితాల మార్క్ షీట్(12th class mark sheet) ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి వేల లైక్‌లు, వందల కామెంట్స్ వస్తున్నాయి.
అసలేం జరిగిందంటే
పూణేకు చెందిన వికాస్ అరోరా అనే వ్యక్తి పని నిమిత్తం ఆటోలో ఎక్కడికో వెళ్తున్నాడు. ప్రయాణ సమయంలో వికాస్-ఆటో డ్రైవర్ మధ్య సంభాషణ మొదలైంది. ఈ క్రమంలో డ్రైవర్ తన కొడుకు గరుడ సచిన్ బాలు మార్కు షీట్ ని వికాస్ కి చూపించాడు. ఆటో డ్రైవర్ కొడుకు మార్క్ షీట్ చూసి బిత్తరపోయాడు వికాస్. అతడి కొడుకు గరుడ సచిన్ బాలు సాధించిన మార్కులు అలా ఉన్నాయ్ మరి. పరీక్షలో గరుడ సచిన్ బాలు ఆరు వందలకు గాను 592 మార్కులు సాధించాడు. దీంతో ఆటో డ్రైవర్ తన కొడుకు మార్క్‌షీట్‌ను ఎంతో ఆనందంగా చూపిస్తున్నాడంటూ సోషల్ మీడియా సైట్ లింక్డ్‌ఇన్‌లో ఆటోడ్రైవర్ కొడుకు మార్క్‌షీట్ ఫొటోని షేర్ చేశారు వికాస్. కొడుకు సాధించిన ఘనతను వివరిస్తూ ఆటో డ్రైవర్ కళ్లల్లో గర్వంతో నిండిన కన్నీళ్లు కూడా వచ్చాయని వికాస్ తన పోస్ట్ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు.
Skin Care Tips For Men : మెరిసిపోయే చర్మం కోసం..వర్షాకాలంలో పురుషులు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
కొడుకు సాధించిన విజయాన్ని గుర్తు తెలియని ప్రయాణికుడితో ఆటో డ్రైవర్ పంచుకోవడం అందరి హృదయాలను కదిలించింది. దీన్ని చూసిన జనాలు ఈ పోస్ట్‌ను వైరల్ చేశారు. కొడుకు చదువు కోసం ఈ పేద తండ్రి ఎంత కష్టపడ్డాడో అతడికే తెలుసు.... అతని కొడుకు ఈ కష్టాన్ని అర్థం చేసుకొని మంచిగా చదివి అతడి కష్టం వృద్ధా కాకుండా తండ్రి గర్వపడేలా చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విద్యార్థి భవిష్యత్తుకు ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే బాగుండు అని కొందరు కామెంట్ చేయగా... విజయానికి మార్కుల కొలమానం కాదని మరికొందరు కామెంట్ చేశారు. ఏదిఏమైనా నెటిజన్లు కొడుకు విజయానికి ఆటోడ్రైవర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు విజయం సాధించాలని కోరుకుంటారు. పిల్లవాడు నిజంగా విజయవంతమైతే, తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు ఈ ఆటోడ్రైవర్ మొహంలో కూడా ఇదే సంతోషం కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral photo