వాళ్లిద్దరూ కవల తోబుట్టువులు. అంటే ఇద్దరూ పోలికల్లోనే కాదు..అలవాట్లు, అభిరుచుల్లో కూడా ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంది. కలిసి పుట్టడం వల్ల వారి మధ్య చాలా విడదీయలేని బంధం ఉంటుంది. ఇది మాత్రమే కాదు వాళ్లిద్దరూ తమ దుస్తులు, పడకలను కూడా ఒకరితో మరొకరు మార్చుకోవడం, షేర్ చేసుకుంటారు.(Identical twins sister share boyfriend). కానీ కవలలు(Twins)గా పుట్టిన ఏ ఇద్దరు అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు తమ జీవిత భాగస్వామిని కూడా కలిసి పంచుకోవడం ఎక్కడైనా విన్నారా..లేదు కదా అలాంటి వాళ్లు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ కాదు. ఆస్ట్రేలియా(Australia)లో ఉన్నారు. వాళ్లెవరంటే..
వాళ్లిద్దరికి ఒకడే ప్రియుడు..
చాలా కాలంగా ప్రపంచానికి తెలియని ఓ ఇద్దరు కవలలుగా పుట్టిన అక్కా చెల్లెళ్లు ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఆస్ట్రేలియాకి చెందిన అన్నా, లూసీ డెసింక్ అనే ఇద్దరు తోబుట్టువులు ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యారు. అదేంటి ట్విన్స్ ప్రపంచంలో చాలా మంది ఉంటారు కదా వీళ్ల ప్రత్యేకత ఏమిటనే కదా మీ అనుమానం. 35 సంవత్సరాల వయసున్న అన్నా, లూసి డెసింక్ అనే ఇద్దరు సిస్టర్స్ తమ లవ్ స్టోరీని పబ్లిక్‌గా చెప్పి బాగా పాపులర్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే ఈ ట్విన్స్ ఒకే వ్యక్తిని ప్రేమించారు. అయితే ఈవిషయంలో ఇద్దరిలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎలాంటి అసూయ అంతకంటే లేదు. ఈవిషయాన్ని వారే దిస్ మార్నింగ్ అనే టీవీ షోలో చెప్పారు. అంతే కాదు తమ లైఫ్‌కి సంబంధించిన ఓ పర్సనల్ సీక్రెట్‌ను కూడా అందరికి చెప్పారు.
పబ్లిక్‌గా చెప్పేశారంతే..
కవలలుగా పుట్టిన అన్నా, లూసీ డెసింగ్ సిస్టర్స్ ఇద్దరికి ఒకే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ...మేము ఇద్దరం అతని నుంచే బిడ్డను కనాలని కోరుకుంటున్నామని తెగేసి మరీ చెప్పారు. అంతే కాదు ఇద్దరూ ఒకేసారి తల్లులు కావాలనే కోరిక కూడా బలంగా ఉందట. టీవీ షోకు వచ్చిన సమయంలో ఈ ముగ్గురు ఒకే అభిప్రాయాన్ని చెప్పారు. ముగ్గురం కలిసే జీవిస్తామని..ఒకరు లేకుండా మరొకరం జీవించలేమని అందుకే బాయ్‌ఫ్రెండ్‌ని కూడా ఇద్దరం కలిసే ఒకడ్ని సెలక్ట్ చేసుకున్నామని చెప్పారు.
ట్విన్స్‌కు తప్పని ట్రోలింగ్..
ట్విన్స్ బెన్ అనే వ్యక్తిని ప్రేమించటమే కాదు ఇద్దరు సిస్టర్స్‌ను అతను ఎంతగానో బాగా చూసుకుంటున్నాడని చెప్పారు. అయితే కోరుకున్నప్పుడల్లా ఇద్దరిని సంతోష పెడతాడని ..కలిసి జీవితం పంచుకుంటున్నాడని అన్నా, లుసి డెసింక్ సిస్టర్స్ చెప్పారు. అయితే ఇదంతా తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో అతడ్ని నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరికి ఒకేసారి పడక సుఖాన్ని ఇస్తున్నావా లేక ఒకరి తర్వత మరొకర్ని సుఖ పెడుతున్నావా అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ట్విన్స్ మాత్రం అలాంటి వాటిని పెద్దగా లెక్క చేయడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International news, World news