Viral Video: ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయంటే ఇదేనేమో..భయంకరమైన సొర చేపతో పోరాడి..

Photo Credit : You Tube

Viral Video: క్రూరజంతువుగా పేరు తెచ్చుకున్న సొరచేపల దాడులలో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో మనుషులు చనిపోతుంటారు. సొరచేపల దాడుల నుంచి ప్రాణాలతో బతికి బట్ట కట్టడం దాదాపు అసాధ్యమే.

  • Share this:
సొరచేపలు నీటిలో శరవేగంగా కదులుతూ ఇతర జీవులను రెప్పపాటు సమయంలో చంపగలవు. అవి మనుషులను సైతం చీల్చి చెండాడగలవు. క్రూరజంతువుగా పేరు తెచ్చుకున్న సొరచేపల దాడులలో ప్రతి ఏడాది పదుల సంఖ్యలో మనుషులు చనిపోతుంటారు. సొరచేపల దాడుల నుంచి ప్రాణాలతో బతికి బట్ట కట్టడం దాదాపు అసాధ్యమే. కానీ కొందరు ధైర్యవంతులు మాత్రం షార్క్‌లను ఎదిరించి ప్రాణాలతో బయటపడగలిగారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి ఆస్ట్రేలియాలో జరిగింది.పూర్తి వివరాలు తెలుసుకుంటే... మాట్ వుడ్ అనే ఒక డ్రోన్ పైలట్ ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బోండి బీచ్ కి వెళ్ళాడు. తన బాల్కనీలో కూర్చొని సరదాగా డ్రోన్ సముద్రంపై ఎగర వేయడం ప్రారంభించాడు. ఆ సందర్భంలోనే అతడికి డ్రోన్ కెమెరాలో ఒక ఈతగాడు కనిపించాడు. ఆ ఈతగాడి చుట్టూ తిరుగుతున్న ఓ భయంకరమైన సొరచేప కూడా కనిపించింది. దీంతో సదరు డ్రోన్ పైలట్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తర్వాత తేరుకుని ఏం జరుగుతుందనే విషయాన్ని తన డ్రోన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ ఈతగాడిని చుట్టుముట్టేది అతి భయంకరమైన మాకో షార్క్ అని తెలుసుకున్నాడు.

అయితే ఇంకా పరీక్షించగా సదరు ఈతగాడు బతికే ఉన్నాడని తెలిసింది. అప్పటికే అతడు స్పీయర్ గన్(నీటిలో ఉపయోగించే బాణం) సాయంతో షార్క్‌తో పోరాడుతూ కనిపించాడు. దీనితో డ్రోన్ పైలట్, తన ప్రియురాలు కలిసి లోకల్ లైఫ్‌గార్డ్ కి సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన లైఫ్‌గార్డ్ డ్రోన్ కెమెరా సహాయంతో ఈతగాడు ఉన్న లొకేషన్ ని గుర్తించాడు. అనంతరం సముద్రంలోకి జెట్ స్కై సహాయంతో సముద్రంలో వెళ్ళాడు. అయితే ఈతగాడిని చేరుకునేందుకు 30 నిమిషాలకు పైగా సమయం పట్టింది. ఎట్టకేలకు అతడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అప్పటికే ఆ ధైర్యవంతుడు షార్క్‌తో పోరాడి ప్రాణాలతో ఒడ్డుకు రాగలిగాడు.

లైఫ్‌గార్డ్ అతన్ని జెట్ స్కై పై ఎక్కించుకొని తిరిగి బీచ్ కి తీసుకొచ్చాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. మాట్ వుడ్ తన డ్రోన్ సహాయంతో ఈతగాడు, షార్క్ చేప మధ్య జరిగిన పోరాట దృశ్యాలను రికార్డ్ చేశాడు. అయితే ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

2019లో కూడా భయంకరమైన షార్క్ దాడి జరిగింది. అమెరికాలో 19 ఏళ్ల అమ్మాయి బీచ్ ట్రిప్ కి వెళ్ళింది. అయితే సముద్రం ఒడ్డున నుంచి యాభై మీటర్ల దూరంలో ఉన్న లోతైన నీళ్లలో ఆమె ఈత కొట్టడం ప్రారంభించింది. ఈ సమయంలోనే బుల్ షార్క్ చేప ఆమె కాలును గట్టిగా నోటితో కరుచుకుంది. దీంతో అక్కడి నీళ్ల రక్తంతో ఎర్రగా మారాయి. ఈలోగా ఆమె తండ్రి నీటి లోపలికి వెళ్ళి తన కూతురిని షార్క్ నుంచి విడిపించాడు.
Published by:Sridhar Reddy
First published: