Home /News /trending /

AUSTRALIAN CRICKETER SHANE WARNE SAYS CAPTAIN SALIM MALIK THREATENED HIM NOT TO PLAY PROPERLY WHEN HE WENT ON TOUR TO PAKISTAN SNR

పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ నన్ను బెదిరించాడు..ఆసిస్‌ మాజీ క్రికెటర్‌ సంచలన వ్యాఖ్యలు

Shane Warne

Shane Warne

Shane Warne: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌వార్న్‌ షాకింగ్ న్యూస్ చెప్పారు. 1994పాక్‌ టూర్‌కి వెళ్లినప్పుడు అప్పటి కెప్టెన్ సలీం మాలిక్ సరిగా ఆడవద్దని తనను బెదిరించాడని చెప్పారు. వార్న్ డాక్యుమెంటరీ కోసం చేసిన ఇంటర్వూలో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ ఈ బాంబ్‌ పేల్చారు.

ఇంకా చదవండి ...
అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో బయటకు రాని చాలా వాస్తవాలు, క్రికెటర్ల పొరపాట్లు, జట్లు మధ్య విభేదాలు ఎన్నో ఇప్పటికి రహస్యంగానే ఉన్నాయి. అలాంటి సీక్రెట్ ఒకటి ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఆ ఆసక్తికరమైన విషయం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, లెగ్‌ స్పిన్నర్ షేన్‌వార్న్‌ (Shane warne)నోటి నుంచి రావడం విశేషం. ఆసిస్ క్రికెటర్ వార్న్‌ డాక్యుమెంటరీ (Documentary)కోసం చేసిన ఇంటర్వూ(Interview)లో ఈ షాకింగ్‌ న్యూస్‌ బయటపెట్టారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ క్రికెటర్, మాజీ కెప్టెన్‌ సలీం మాలిక్‌(Salim Malik)కి సంబంధించిన విషయాన్ని ఇంటర్వూలో ప్రస్తావించారు ఆసీస్‌ మాజీ క్రికెటర్ షేన్ వార్న్. 1994లో ఆస్ట్రేలియా జట్టు (Australia cricket team)పాకిస్థాన్‌ టూర్‌(Pakistan tour)కి వెళ్లినప్పుడు అప్పటి పాకిస్తాన్‌ టీమ్ కెప్టెన్ సలీం మాలిక్ తనను ప్రలోభ పెట్టాడంటూ షాకింగ్ న్యూస్‌ చెప్పారు. కరాచీ(Karachi)లో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌(Test match)కి ముందు సలీం మాలిక్‌ తనను బెదిరించాడని...మ్యాచ్‌లో బౌలింగ్‌ (Bowling)సరిగా వేయవద్దని హెచ్చరించిన విషయాన్ని వార్న్‌ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా జట్టు ఓడిపోయే విధంగా పేలవంగా బౌలింగ్ వేస్తే లంచం ఇస్తామంటూ ఒత్తిడికి గురి చేసిన విషయాన్ని ఈసందర్భంగా చెప్పుకొచ్చారు వార్న్. 28ఏళ్ల క్రితం పాకిస్తాన్‌ జట్టు చూపించిన వక్ర బుద్ధిని వార్న్‌ ఇప్పుడు బయటపెట్టడం సంచలనంగా మారింది. అయితే షేన్‌వార్న్‌ డాక్యుమెంటరీలో ఈ విషయంతో పాటు ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటపెట్టాడన్న ఆసక్తి క్రికెట్ అభిమానుల్లో మొదలైంది.

పాకిస్తాన్‌ పేరెత్తితే..
పాకిస్తాన్‌ అంటేనే మిగిలిన దేశాల క్రికెట్‌ జట్లకు ఓ అభద్రత. ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని పరిణామాలే ఇందుకు కారణం. 2009 మార్చి నెలలో లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో మ్యాచ్‌ జరుగుతుండగా శ్రీలంక ఆటగాళ్లను టార్గెట్‌ చేస్తూ దాడి జరిగింది. స్టేడియం మధ్యలో పాకిస్తాన్‌ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడంతో లంక ఆటగాళ్లు ఐదుగురు గాయపడ్డారు. ఈ దాడిలోనే ఆరుగురు పోలీసులు, మరో ఇద్దరు స్థానికులు మృతి చెందారు. ఈ దాడికి నాయకత్వం వహించింది ఎవరో కాదు ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన హఫీజ్ మొహ్మద్‌ సయిూద్ అని తేలింది. ఆ దాడి కారణంగానే 2010లో సౌతాఫ్రికా -పాకిస్తాన్‌ మధ్య టూర్‌ కూడా రద్దైంది. 2012 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌ జట్టు తమ పాకిస్తాన్‌ టూర్‌కి రావడం లేదని ప్రకటించింది. ఆ తర్వాత 2016లో వన్డే,టెస్ట్‌ సిరీస్‌లకు వెస్టిండీస్‌ జట్టును పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డు ఆహ్వానించినించింది. కేవలం భద్రత కారణాలతోనే బంగ్లా జట్టు వెళ్లకపోవడంతో టూర్ రద్దైంది. 2019లో కూడా రెండు వన్డేలు ఆడాలంటూ పీసీబీ అభ్యర్ధనను ఆస్ట్రేలియా తిరస్కరించింది. గతంలో జరిగిన ఇలాంటి పరిణామాలను పరిశీలిస్తే ..పాకిస్తాన్‌కి వెళ్లి మ్యాచ్‌లు ఆడాలంటే మిగిలిన దేశాల క్రికెట్‌ జట్లు భద్రత విషయంలో వెనకడుగు వేసిన సందర్భాలే అనేక ఉన్నాయి. ఇవే కాదు తాజాగా కివీస్ జట్టు సైతం పాక్‌తో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌ నుంచి వైదొలగింది. తమ జట్టుకు ముప్పు ఉందన్న కారణంతోనే సిరీస్‌ని రద్దు చేసినట్లుగా న్యూజిలాండ్ క్రికెట్‌ జట్టు ప్రకటించింది. దీనిపై పాక్‌ మాజీ క్రికెటర్‌లు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే.

గత చరిత్ర అదే చెబుతోంది..
శ్రీలంక జట్టుపై దాడి మొదల్కొని న్యూజిలాండ్‌ టీం సిరీస్‌ను రద్దు చేసుకునే వరకూ చూసుకుంటే పాకిస్తాన్‌లో ధైర్యంగా క్రికెట్‌ ఆడలేని పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి చూస్తే ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్‌వార్న్‌ ఇంటర్వూలో చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా పాకిస్తాన్‌ క్రికెట్‌కు కోలుకోలేని నష్టం తప్పదనే సంకేతాలు వస్తున్నాయి.

నష్టపోయేది వాళ్లే..
అంతర్జాతీయ క్రికెట్‌ను బాగా కుదిపేసిన అంశం మ్యాచ్‌ ఫిక్సింగ్. ఈ ఆరోపణలు చాలా మంది క్రికెటర్లపై వచ్చాయి. అందులో కొందరు ఆటగాళ్లు ఫిక్సింగ్‌కి పాల్పడి దొరికిపోయి మూల్యం చెల్లించుకున్నారు. మరికొందరు ఆరోపణలు మాత్రమే ఎదుర్కొన్న వాళ్లు ఉన్నారు. కానీ అంతకంటే దారుణమై విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్‌వార్న్ ఓ ప్రత్యేక ఇంటర్వూలో బయటపెట్టడం పెనుప్రకంపనలకు దారి తీసేలా ఉంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Australia, Cricket, Pakistan

తదుపరి వార్తలు