బుట్ట బొమ్మ సాంగ్‌లో దుమ్ము రేపిన డేవిడ్ వార్నర్ దంపతులు..

Butta Bomma : టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఈ పాట బాగా ఫేమస్ అయ్యింది. ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా గంతులేసేంతగా.

news18-telugu
Updated: April 30, 2020, 1:18 PM IST
బుట్ట బొమ్మ సాంగ్‌లో దుమ్ము రేపిన డేవిడ్ వార్నర్ దంపతులు..
అల్లు అర్జున్, పూజా హెగ్డే.. డేవిడ్ వార్నర్ దంపతులు
  • Share this:
Butta Bomma : అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఈ సినిమా.. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్‌లో తమన్ సమకూర్చిన పాటలు కీ రోల్ పోషించాయి. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమాలోని పాటలు పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ముఖ్యంగా సామజవరగమన, బుట్ట బొమ్మ వంటి సాంగ్స్  పెద్ద హిట్ అయ్యాయి. టిక్ టాక్‌లో ఇటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ సందడి చేసిందీ పాట. ఈ పాటకు హిందీ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి, దిశా పటానీ తదితరులు ఫిదా అయిపోయారు.

టాలీవుడ్, బాలీవుడ్‌లోనే కాదు.. అంతర్జాతీయంగా కూడా ఈ పాట బాగా ఫేమస్ అయ్యింది. ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా గంతులేసేంతగా. సన్‌రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ధరించిన వార్నర్ తన సతీమణితో కలిసి ఈ పాటకు టిక్‌టాక్‌ చేశాడు. వెనకాల తన కూతురు కూడా అటూ ఇటూ తిరుగుతూ హల్ ‌చల్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ కింది లింక్‌లో మీరూ ఓ లుక్కేయండి..

Published by: Shravan Kumar Bommakanti
First published: April 30, 2020, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading