వేగంగా వెళ్తున్న కారు అద్దంపై పాము ప్రత్యక్షం.. వైపర్ తో తొలగించేందుకు ప్రయత్నం.. చివరకు..

కారు అద్దంపై పాము

భార్యాభర్తలిద్దరూ కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో.. ఒక పాము కారు ముందు అద్దంపై పడింది. దీంతో ఆ పామును చూసిన కారులోని వారంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఆ తర్వాత..

  • Share this:
కారులో ప్రయాణిస్తున్న ఓ జంటకు విచిత్ర సంఘటన ఎదురైంది. భార్యాభర్తలిద్దరూ కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యంలో అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో.. ఒక పాము కారు ముందు అద్దంపై పడింది. దీంతో ఆ పామును చూసిన కారులోని వారంతా ఒక్కసారిగా భయపడిపోయారు. వెంటనే డ్రైవర్ కి ఒక ఆలోచన తట్టింది. కారు ముందు అద్దంపై నీరు లేకుండా చేసే వైపర్ సహాయంతో పామును పక్కకు నెట్టేయాలనుకున్నాడు. అయితే వైపర్ ని ప్రారంభించగానే ఆ పాము మరోలా స్పందించింది. ఒక్కసారిగా కారు సైడ్ విండో వైపు వచ్చింది. అదృష్టవశాత్తు కారు అన్ని వైపులా లాక్ చేసి ఉండటంతో పాము లోపలికి ప్రవేశించలేదు. దీంతో వారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆస్ట్రేలియాలోని క్వీన్ ల్యాండ్ లో గల బ్రూస్ హైవే మీద ఈ ఘటన చోటుచేసుకుంది. మెలిస్సా హడ్సన్, ఆమె భర్త రోడ్నీ గ్రిగ్స్ కారులో బ్రూస్ హైవేపై ప్రయాణిస్తూ క్వీన్ ల్యాండ్ లోని ఎలిగేటర్ క్రీక్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కారులో వేగంగా ప్రయాణిస్తుండగా ఓ పాము వచ్చి అద్దం ముందు ప్రత్యక్షమైంది. భయపడిపోయిన వారు ఈ పామును వైపర్ తో తొలగించాలని భావించారు. డ్రైవర్ వైపర్ తో పామును పదేపదే కొట్టసాగాడు అయినా ఫలితం లేకుండా పోయింది. ఆ పాము కింద పడకుండా కారు డ్రైవర్ విండో మీదకు వచ్చింది. అలాగే కొద్ది దూరం వెళ్లాక ట్రాఫిక్ సిగ్నల్ రావడంతో ట్రాఫిక్ కంట్రోలర్ కారుపై ఉన్న పామును చూసి ఎదురుగా రాబోతున్న కార్లను ఆపివేశాడు. అప్పుడు ఆ పాము కారును విడిచి రహదారి దాటుకుంటూ పొదల్లోకి వెళ్లింది. దీంతో ఆ జంట ఊపిరి పీల్చుకున్నారు.తీవ్రంగా తప్పుబడుతున్న నెటిజన్లు..
కాగా, ఈ వీడియో చూసిన కొంతమంది నెటిజన్లు ఆ జంటపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పామును వైపర్ తో తొలగించాలని ప్రయత్నించడాన్ని నెటిజన్లు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. అలా చేయడం వన్య ప్రాణులను హింసించడం కిందికే వస్తుందని, ఇది క్రూరత్వ చర్య అని కొంతమంది నెటిజన్లు వాపోయారు. వైపర్ కారణంగా ఆ పాము గాయపడినా, చనిపోయినా వారు నేరం చేసినట్లేనని చెబుతున్నారు. వైపర్ తో తొలగించే బదులు కారును పక్కకు నిలిపివేసి వదిలిపెట్టాల్సిందని పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
చివరకు: స్నేహితుడి పెళ్లికి వెరైటీ బహుమతిని ఇచ్చిన యువకులు.. గిఫ్ట్ బాక్సులో ఏముందో చూసి పెళ్లికి వచ్చిన వాళ్లంతా..

ఒక మూగ జీవికి హాని తలపెట్టినందుకు వారికి జరిమానా విధించాలని మరికొంత మంది నెటిజన్లు కోరుతున్నారు. దీనిపై కారు డ్రైవర్ మెలిస్సా హడ్సన్ మీడియా మాట్లాడుతూ.. ‘‘ట్రాఫిక్ కంట్రోలర్ నిఘా ఉండటం వల్ల రోడ్డుపై కారును అప్పటికప్పుడు ఆపడం సాధ్యం కాలేదు. అంతేకాక ఆ పాము వేరే మార్గం ద్వారా కారు లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. ఆ భయంతోనే దాన్ని వైపర్ తో తొలగించాలని ప్రయత్నించాం. లేకపోతే మేము ప్రమాదంలో పడేవాళ్లం. అదృష్టవశాత్తు ఆ పాముకు కూడా ఎటువంటి గాయాలు కాలేదు’’ అని వివరించింది.
చివరకు: ఏలియన్స్ జాడ కనుక్కునేందుకు రూ.17,450 కోట్లతో నాసా రోవర్ ప్రయోగం.. ఆ ఏడు నిమిషాలు గండమే..
Published by:Hasaan Kandula
First published: