Australia World Cup 2019 Squad: వరల్డ్ కప్ ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్, వార్నర్‌

2019 World Cup | Australia World Cup 2019 Squad: క్రికెట్ వరల్డ్ కప్‌కు ఎంపికైన 15 మందితో కూడిన ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ చోటు దక్కించుకున్నారు. బాల్ ట్యాంపరింగ్‌లో వీరిద్దరిపై ఏడాది నిషేధం ఇటీవల పూర్తి కావడంతో ఆసీస్ క్రికెట్ బోర్డు నుంచి వీరికి పిలుపు వచ్చింది.

news18-telugu
Updated: May 16, 2019, 6:53 PM IST
Australia World Cup 2019 Squad: వరల్డ్ కప్ ఆసీస్ జట్టులో స్టీవ్ స్మిత్, వార్నర్‌
ఏడాది నిషేధం తర్వాత ఆసీస్ జట్టులోకి డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌కు పిలుపు
news18-telugu
Updated: May 16, 2019, 6:53 PM IST
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌, డ్యాషింగ్‌ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ వరల్డ్ కప్‌కు ఎంపికైన  ఆసీస్ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ గతేడాది బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకొని ఏడాది పాటు క్రికెట్‌ నుంచి నిషేధానికి గురికావడం తెలిసిందే. ఇటీవల వీరిపై నిషేధం ముగిసింది. ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్‌లో రాణిస్తున్నారు. అందరూ ఊహించినట్లే  వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వీరిద్దరికీ ఆసీస్‌ క్రికెట్‌ బోర్డు అవకాశం ఇచ్చింది. ఏడాది నిషేధం పూర్తయిన తర్వాత వీరిద్దరికీ ఆసీస్ క్రికెట్ బోర్డు నుంచి పిలుపురావడం ఇదే తొలిసారి.  వార్నర్‌, స్మిత్‌ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవడంతో పూర్తి ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌, ఫాస్ట్‌బౌలర్‌ హెజిల్‌వుడ్‌కు మొండి చేయి ఎదురయ్యింది.  భారత పర్యటనలో రాణించిన టర్నర్‌కు కూడా నిరాశ ఎదురైంది.ఆరోన్‌ ఫించ్‌ జట్టుకు సారథ్యంవహించనున్నాడు.





ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో రాణించిన ఉస్మాన్‌ ఖవాజాతో పాటు షాన్‌ మార్ష్‌, ఆల్‌రౌండర్లు స్టొయినీస్‌, మ్యాక్స్‌వెల్‌‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. బౌలింగ్‌ విభాగంలో ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, రిచర్డ్‌ సన్‌, నాథన్‌ కౌల్టర్నైల్‌, బెహ్రెండార్ఫ్‌ను జట్టులోకి తీసుకుంది. స్పిన్‌ విభాగంలో నాథన్‌ లైయన్‌, ఆడమ్‌ జంపాలు ఊహించినట్లుగానే స్థానం దక్కించుకున్నారు.ఇంగ్లండ్, వేల్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను జూన్‌ 1న అఫ్గనిస్థాన్‌తో తలపడనుంది.

ఇదీ ఆస్ట్రేలియా జట్టు: ఆరోన్‌ ఫించ్‌(కెప్టెన్‌), ఉస్మాన్‌ ఖవాజా, డేవిడ్ వార్నర్‌, స్టీవ్ స్మిత్‌,  షాన్‌ మార్ష్‌, మాక్స్‌వెల్‌, బెహ్రెండార్ఫ్‌, అలెక్స్‌ కేరీ(వికెట్‌ కీపర్‌), కౌల్టర్‌నైల్‌, కమిన్స్‌, నాథన్‌ లైయన్‌,  రిచర్డ్‌సన్‌, స్టార్క్‌, స్టొయినీస్‌,  ఆడమ్‌ జంపా.
Loading...

First published: April 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...