ఆస్ట్రేలియాలో భారీ రెస్క్యూ ఆపరేషన్... జంతువుల కోసం దుంపలు

Australia Wild Fire 2020 : ఇక్కడ మనం చలి ఎక్కువై... చలి మంటలు కాచుకుంటున్నాం. అక్కడ ఆస్ట్రేలియాలో కార్చిచ్చును ఆర్పడం సాధ్యం కావట్లేదు. అందువల్ల జంతువులకు ఇబ్బంది కలగకుండా... ఆహారాన్ని జారవిడుస్తున్నారు.

news18-telugu
Updated: January 14, 2020, 8:18 AM IST
ఆస్ట్రేలియాలో భారీ రెస్క్యూ ఆపరేషన్... జంతువుల కోసం దుంపలు
ఆస్ట్రేలియాలో భారీ రెస్క్యూ ఆపరేషన్... జంతువుల కోసం దుంపలు (credit - instagram)
  • Share this:
Australia Wild Fire 2020 : ఆస్ట్రేలియాలో ఈసారి ఎండాకాలం భగ్గుమంటోంది. ఎప్పుడూ లేనంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కారణం... న్యూసౌత్ వేల్స్ అడవుల్లో చెలరేగిన కార్చిచ్చే. ఐదు నెలలుగా... అది కొనసాగుతూనే ఉంది. దాని వల్ల 2 కోట్ల ఎకరాల్లో అడవులు, భూములూ తగలబడిపోయాయి. ఇప్పటికే 27 మంది ప్రజలు చనిపోయారు. 2000కు పైగా ఇళ్లు కాలిబూడిదయ్యాయి. 35 కోట్ల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలైంది. 100 కోట్లకు పైగా పక్షులు, జంతువులు, ఇతర ప్రాణులూ చనిపోయాయని అంచనా. ఇప్పటికీ ఎన్నో జంతువులు కార్చిచ్చు వ్యాపించిన అడవుల్లోనే ఉన్నాయి. వాటిని అక్కడి నుంచీ తరలించేందుకు వీలు కాకపోవడంతో... వాటి కోసం... న్యూసౌత్‌వేల్స్‌ ప్రభుత్వం ‘ఆపరేషన్‌ రాక్‌ వల్లబీ’ చేపట్టింది. అందులో భాగంగా 2,200 కేజీల కేరట్‌, చిలగడదుంపలను హెలికాప్టర్ల ద్వారా అడవుల్లోకి వదిలారు. ఆ దుంపల్ని తినేందుకు ఆకలితో నకనకలాడుతున్న మూగ జీవాలు ఎగబడ్డాయి. వల్లబీ అనేది కంగారూ జాతికే చెందిన క్షీరదం. కొండలు, పర్వత ప్రాంతాల్లోనే ఉంటుంది. అందుకే దాన్ని రాక్‌ వల్లబీ అని అంటున్నారు.
View this post on Instagram

Australia food drops: More than 4,000 lbs of vegetables released from helicopters. 🥕🚁⁠ ⁠ Australia is fighting to keep wildlife from starving to death amid recent wildfire destruction that left millions of acres of land destroyed. Wildlife officials in southeast Australia have started food drops for animals. More than 4,000 pounds of carrots and sweet potatoes are being dropped to aid endangered species, such as the brush-tailed rock wallaby.⁠ ⁠ These fires have burned for nearly 3 months, killing 28 people and destroying 2,000 homes. One scientist estimates more than 1 billion animals have been killed. Link in bio for more info. ⁠ ⁠ #australiawildfires #koala #wallaby #fooddrop #wildfires ⁠


A post shared by NBC New York (@nbcnewyork) on

ఇప్పటికే చాలా కంగారూలు, కోయలాలను రక్షించారు. ఇప్పుడు వల్లబీలను కూడా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే... వాటి కోసం జారవిడుస్తున్న ఆహారంతో... అక్కడి అడవుల్లోని అరుదైన కంగారూలు, గ్లైడర్లు, పొటొరూస్‌, కాకటూస్‌, హనీఈటర్స్‌ల కడుపు నిండుతోంది. మరోవైపు కోయలాలను అంతరించిపోయే జంతు జాతిలో చేర్చాలని ఆస్ట్రేలియా అనుకుంటోంది. కార్చిచ్చు ప్రాంతాల్లో... ఆరోగ్యసేవల కోసం రూ.37 కోట్లను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కా్ట్ మారిసన్... అత్యవసర సాయాన్ని ప్రకటించారు. స్వచ్ఛంద సంస్థలు కూడా ఇలాంటి నిధుల సేకరణ చేపడుతున్నాయి.

View this post on Instagram

Miles de Koalas 🐨 han muerto en los incendios australianos, esperamos que su población no se extinga y crezca en los próximos años. Los incendios forestales apocalípticos en Australia han matado hasta ahora a casi medio billón de animales y quemaron ya casi 2 millones de hectareas, más del triple del área destruida por los incendios de 2018 en California y 6 veces el tamaño de los incendios de 2019 en el Amazonas. Los ecologistas también estiman que casi el 30% de los koalas han muerto, ya que los animales que se mueven lentamente no pueden escapar de las llamas. Donar es la mejor manera de ayudar, pero si no puedes permitirte donar, ayuda difundiendo. Tener un gran impacto y generar concienciación es importantísimo. Etiqueta a tus amigos para que se corra la voz. Las webs de confianza donde podemos entrar, informarnos y donar, son: www.wires.org.au www.cfa.vic.gov.au www.givit.org.au www.cfsfoundation.org.au www.redcross.org.au www.koalahospital.org.au #australia #bushfires #wildfires #support #koalas #koala #wildlife #nature #naturaleza #animallovers Vídeo: @lukewormann


A post shared by Pura Vida Diving Koh Tao (@puravidadivingkohtao) on
Published by: Krishna Kumar N
First published: January 14, 2020, 8:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading