అసలే వరదలు... మధ్యలో ఈ మొసళ్లు, పాముల కలకలం... ఆస్ట్రేలియన్లకు కొత్త కష్టాలు

Australia Floods : మన ఇంటి పక్కనో, రోడ్డుపైనో, సెల్లార్‌లోనో మొసలో, పామో కనిపిస్తే ఏం చేస్తాం. ముందు షాకవుతాం... తర్వాత భయపడతాం... ఇప్పుడు ఆస్ట్రేలియాలో అదే జరుగుతోంది. వరదల్లో కొట్టుకొస్తున్న మొసళ్లు, పాములూ జనానికి నిద్ర లేకుండా చేస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: February 5, 2019, 10:49 AM IST
అసలే వరదలు... మధ్యలో ఈ మొసళ్లు, పాముల కలకలం... ఆస్ట్రేలియన్లకు కొత్త కష్టాలు
ఆస్ట్రేలియా వరదల్లో మొసళ్లు (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: February 5, 2019, 10:49 AM IST
ఆస్ట్రేలియాలో వరదలు ఏ రేంజ్‌లో వచ్చాయో వారం నుంచీ చూస్తూనే ఉన్నాం. ఆ వరద నీటిలో ఈదుకుంటూ... పాములు, మొసళ్లు చుట్టుపక్కల ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి. రోడ్లపైనా, ఇళ్ల దగ్గర, చెట్లపైనా, సెల్లార్లలో... ఇలా ఎక్కడ చూసినా మొసలో, పామో కనిపిస్తున్నాయి. వాటిని చూసి పై ప్రాణాలు పైనే పోతున్నాయి. వారం నుంచీ ఈశాన్య ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌ను వరదలు ముంచేస్తున్నాయి. ఆల్రెడీ చాలా మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అలా వెళ్లిన వాళ్లంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఐతే... క్వీన్స్‌లాండ్ తీరంలో ఉండే మొసళ్లు, పాములు కూడా వరదలకు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఎటు వెళ్లాలో తెలియక... వరద నీరు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తున్నాయి. చివరకు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి వెళ్లి... అక్కడ తిరుగుతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ ఏ మొసలి కనిపిస్తుందోనని హడలిపోతున్నారు జనం.

టౌన్స్‌విల్లేలో ఓ మొసలి... వాలుగా ఉన్న ఓ చెట్టు ఎక్కేసింది. ప్రజలు ఎంతగా ప్రయత్నిస్తున్నా... అది అక్కడి నుంచీ దిగట్లేదని ఓ నెటిజన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని క్వీన్స్‌లాండ్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మీకు ఎక్కడైనా మొసళ్లు, పాముల వంటివి కనిపిస్తే, వెంటనే సమాచారం ఇవ్వండి అని పదే పదే చెబుతున్నారు. వరద నీటిలోకి దిగవద్దని వార్నింగ్ ఇస్తున్నారు. క్వీన్స్‌లాండ్ క్రొకొడైల్ మేనేజ్‌మెంట్ ప్లాన్ అమల్లోకి వచ్చింది.

australia, crocodiles, snakes, australia floods, queensland floods, australia flood crocodiles, feared lost in australia floods, homes feared lost in australia floods, australia flood crocodile, flood crocodiles, australian crocodile, australia snakes, giant crocodile, ఆస్ట్రేలియా వరదలు, మొసళ్లు పాములు
ఆస్ట్రేలియా వరదల్లో మొసళ్లు (Image : Twitter)


మీకు తెలుసా... ఆస్ట్రేలియాలో పాములు చాలా వేగంగా ఈదగలవు. అందువల్ల అక్కడ కనిపించే పాములను పట్టుకోవడం కంటే... అలా వదిలేస్తే... వాటి దారిన అవే పోతాయని ఎన్విరాన్‌మెంట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. టౌన్స్‌విల్లేలో 20,000 ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. ఫలితంగా వాటిలో ఉండే 1,75,000 మంది లతో దిక్కుకూ వెళ్లిపోయారు.

australia, crocodiles, snakes, australia floods, queensland floods, australia flood crocodiles, feared lost in australia floods, homes feared lost in australia floods, australia flood crocodile, flood crocodiles, australian crocodile, australia snakes, giant crocodile, ఆస్ట్రేలియా వరదలు, మొసళ్లు పాములు
ఆస్ట్రేలియా వరదల్లో మొసళ్లు (Image : Twitter)


రోస్ రివర్ డ్యామ్ గేట్లను ఎత్తివేస్తే, దాదాపు 2,000 ఇళ్లలో వరద నీరు బయటకు వెళ్లిపోతుందని చెబుతున్నారు. ఐతే... వరదలు వచ్చే వారం వరకూ ఉంటాయన్నది వాతావరణ నిపుణుల అంచనా. అప్పటివరకూ ఈ పాకే, ఈదే వన్యప్రాణులతో జాగ్రత్త పడాల్సిందే.

 

Video: రోడ్డు దాటుతుండుగా మహిళ హోంగార్డుకు ప్రమాదం..మృతి
First published: February 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...