HOME »NEWS »TRENDING »australia cricketer david warner as shah rukh khan krs

Viral Video: షారూక్ ఖాన్​లా మారిన వార్నర్ భాయ్.. ఆ యాప్ ఉపయోగించి

Viral Video: షారూక్ ఖాన్​లా మారిన వార్నర్ భాయ్.. ఆ యాప్ ఉపయోగించి
Instagram Photo

David Warner: డేవిడ్ వార్నర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఇప్పటికే మిలియన్​కు పైగా వ్యూస్ రాగా వేలాది కామెంట్లు, లైక్​లు కురుస్తున్నాయి.

  • Share this:
    ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్​కు సోషల్ మీడియాలో క్రేజ్ మామూలుగా లేదు. లాక్​డౌన్ సమయంలో అతడు చేసిన డ్యాన్స్​లు, సరదా వీడియోలకు భారత అభిమానులు ఫిదా అయిపోయారు, ప్రస్తుతం వార్నర్​కు ఇన్​స్టాగ్రామ్​లో ఐదు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్​లా వార్నర్ దర్శనమిచ్చాడు. రీఫేస్ యాప్​ను ఉపయోగించి బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్​​లా కనిపించేలా ఓ వీడియో చేశాడు. డాన్​-2లోని షారూక్ యాక్షన్ సీన్​ను వార్నర్ వాడుకున్నాడు.

    షారూక్ ఖాన్ యాక్షన్ సీక్వెన్స్​  ను వార్నర్ తీసుకున్నాడు. వీడియోలోని హింసకు అభిమానులకు క్షమాపణ చెప్పాడు. ఈ యాక్టర్ పేరును గెస్ చేయండి అంటూ అభిమానులకు ప్రశ్న వేశాడు. షారూక్ ఖాన్ అభిమానులు సునాయాసంగా గుర్తు పట్టేశారు. “ఇందులోని హింస పట్ల సారీ చెబుతున్నా. అయితే మీరు ఇది గెస్ చేయలేరని అనుకుంటున్నా” అంటూ వార్నర్ వీడియోను పోస్ట్ చేశాడు.





    వార్నర్​.. షారూక్ లా చేసిన వీడియో ఒక్కరోజులోనే మిలియన్​కు పైగా వ్యూస్ దక్కించుకుంది. వేలాది కామెంట్లు వచ్చాయి. బాలీవుడ్​లో నటించాలని చాలా మంది అభిమానులు వార్నర్​ను కోరారు. కాగా డాన్ 2 సినిమా డైరెక్టర్ ఫరా ఖాన్ కూడా ఈ వీడియోకు స్పందించారు. “డాన్ అండర్​.. చేజ్ కొనసాగుతుంది” అని కామెంట్ చేశారు. “హాలీవుడ్​, బాలీవుడ్, కోలీవుడ్​.. ఆల్​ఇన్ వన్ వార్నర్​” అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.




    ఇటీవలే హృతిక్ రోషన్ సీన్లను సైతం వార్నర్ తీసుకున్నాడు. పలు చిత్రాల్లోని సీన్లను ఎంపిక చేసుకొని రీఫేస్ యాప్ ద్వారా తనను రిప్లేస్ చేసుకున్నాడు. అభిమానులకు మాంచి కిక్ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న వార్నర్ భారత్​తో రెండో టెస్టుకు సైతం దూరమయ్యాడు.
    Published by:Krishna P
    First published:December 24, 2020, 08:55 IST

    टॉप स्टोरीज