Home /News /trending /

AUSTRALIA COMPANY TAKES EMPLOYEES ON ALL EXPENSES PAID 2 WEEK TRIP TO INDONESIA BALI PAH

ది వరల్డ్ బెస్ట్ బాస్.. అన్ని ఖర్చులు కంపెనీవే.. 2 వీక్స్ పెయిడ్ హలీడే.. ఎక్కడంటే..

టూర్ లో ఎంజాయ్ చేస్తున్న ఉద్యోగులు

టూర్ లో ఎంజాయ్ చేస్తున్న ఉద్యోగులు

Australia: ఆస్ట్రేలియాకు చెందిన కంపెనీ తమ ఉద్యోగులకు ఊహించని సర్ ఫ్రైజ్ ఇచ్చింది. అన్ని ఖర్చులు భరించి బాలికి రెండు వారాల పర్యటనకు తీసుకు వెళ్లింది.

కంపెనీలు సాధారణంగా తమ ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్స్ ఇస్తుంటాయి. హెల్స్ బెనిఫిట్స్, సంవత్సరానికి కొన్ని సార్లు.. టూర్ ప్యాకెజ్ లు, అలవేన్సులు ఇస్తుంటాయి. పెళ్లి వేడుకలకు స్పెషల్ గిఫ్ట్ వోచర్స్ లు ఇస్తుంటాయి. కంపెనీకి లాభాలు వచ్చిన వాటిలో కొంత పర్సంటేజ్ లను కూడా సదరు కంపెనీలోని ఉద్యోగులకు ఇస్తుంటాయి. అయితే, కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను ఎంతో బాగా చూసుకుంటాయి. ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీలు పెళ్లి కానీ వారికి, పెళ్లి సంబంధాలు చూసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. అయితే, ఇలాంటి పెద్దమనసు చాటుకున్న కంపెనీ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. ఆస్ట్రేలియా (Australia) సిడ్నీకి చెందిన మార్కెటింగ్ సంస్థ తమ ఉద్యోగులకు కలలో కూడా ఊహించని విధంగా సర్ ప్రైజ్ కు గురిచేసింది. సూప్ ఏజెన్సీ సంస్థ.. తమ ఉద్యోగులు రెండు వారాల పాటు ఇండోనేషియా ద్వీపానికి తీసుకెళ్లింది. అంతే కాకుండా రెండు వారాలను పెయిడ్ లీవ్ కింద అప్రూవ్ చేసింది. అంతేకాకుండా, కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు.. అక్కడ పెట్టుకున్న ఖర్చులను కూడా కంపెనీయే చెల్లించింది. దీంతో ఉద్యోగులంతా షాక్ కు గురయ్యారు.










View this post on Instagram






A post shared by Soup Agency (@soup_agency)






తాజాగా, కంపెనీ సూప్ ఏజెన్సీ సంస్థ ఇన్ స్టాలో, కంపెనీ ఉద్యోగులు ఎంజాయ్ చేసిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలు కంపెనీ ఉద్యోగులు బాలీలో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ జోష్ గా గడుపుతున్నారు. యోగా చేస్తున్నారు. గ్రూప్ లుగా ఏర్పడి అక్కడి వాతావరణంలో ఛిల్ అవుతున్నారు. సూప్‌లో మేనేజింగ్ డైరెక్టర్ కాట్యా వకులెంకో మాట్లాడుతూ.. తమ ఉద్యోగులకు వర్క్ ప్రెషర్ తగ్గించడానికి, వారికి రిఫ్రెష్ మెంట్ కోసం ఇలాంటి ప్రొగ్రామ్ చేపట్టామని అన్నారు. దీనితో ఉద్యోగులకు కంపెనీ పట్ల అంకిత భావం, నిబద్దత, గౌరవం పెరుగుతుందని, దీనితో ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Australia, Company, Tourist place, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు