Home /News /trending /

AUNT PERFORM KANYADAN OF HER DAUGHTER IN LAW AFTER THE DEATH OF SON IN SIKAR IN RAJASTHAN MKS

Rajasthan: అందమైన కోడల్ని కోరి తెచ్చుకుంది.. కానీ అనూహ్య ఘటన తర్వాత ఆ అత్త తీసుకున్న నిర్ణయమిది..

ఆదర్శ అత్తతో లక్కీ కోడలు

ఆదర్శ అత్తతో లక్కీ కోడలు

అమ్మాయిలపై ఆంక్షలు, మహిళలకు కట్టడి విధిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. కానీ ఇప్పుడు అక్కడ మార్పు మొదలైంది. ఆడబిడ్డల విషయంలో పెద్దలు పెద్దమనసు చాటుకుంటున్నారు. కోడలి విషయంలో కోడలి విషయంలో ఓ వృద్ధ దంపతులు చూపిన ఆదరణ ప్రశంసలు అందుకుంటోంది.

ఇంకా చదవండి ...
అమ్మాయిలపై ఆంక్షలు, మహిళలకు కట్టడి విధిస్తూ నిత్యం వార్తల్లో నిలిచే రాష్ట్రాల్లో రాజస్థాన్ ఒకటి. కానీ ఇప్పుడు అక్కడ మార్పు మొదలైంది. ఆడబిడ్డల విషయంలో పెద్దలు పెద్దమనసు చాటుకుంటున్నారు. కోడలి విషయంలో కోడలి విషయంలో ఓ వృద్ధ దంపతులు చూపిన ఆదరణ ప్రశంసలు అందుకుంటోంది. ఏరికోరి అందమైన అమ్మాయిని కోడలిగా తెచ్చుకున్నారు. కానీ పెళ్లి జరిగిన ఆరు నెలలకే ఆమెను దురదృష్టం వెంటాడింది. ఏడాది కూడా గడవకముందే భర్తను కోల్పోయింది. అయితే అత్తమామలు ఆమెకు అండగా నిలిచారు. కొడుకే లేనపుడు కోడలు ఎందుకని ఆమెను వదిలేయలేదు.

చిన్న వయసులోనే వితంతువైన కోడలిని కన్న కూతురిలా చూసుకున్నారు ఆ అత్తామామలు. ఆమెను చదివించారు. మంచి ఉద్యోగం తెచ్చుకునేలా ప్రోత్సహించారు. అనంతరం మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. రాజస్థాన్ లోని సికార్ కు చెందిన అత్తమామలు కోడలి పట్ల చూపిన ఆదరణ, వారే తల్లిదండ్రులుగా మారి కోడలికి కన్యాదానం చేసిన తీరు స్థానికంగానేకాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ అత్తమామలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Selfie: ఈ అందగాడు సెల్ఫీలతో కోటీశ్వరుడయ్యాడు.. ఏడేళ్లుగా రోజుకో సెల్ఫీ.. NFTలో భారీ డిమాండ్..


రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన కమలా దేవి, దిలావర్ దంపతుల కుమారుడు శుభమ్‌కు 2016లో సునీత అనే యువతితో వివాహం జరిగింది. వివాహం జరిగిన ఆరు నెలలకే బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో శుభమ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సునీత ఒంటరి అయిపోయింది. పేద కుటుంబానికి చెందిన సునీతను కమలా దేవి దంపతులు వదులుకోలేదు. ఆమెను తమ దగ్గరే ఉంచుకుని చదివించారు. అత్తమామల ప్రోత్సాహంతో సునీత ఎమ్.ఎ.బీ.ఈడీ చదవింది. పోటీ పరీక్ష రాసి జూనియర్ లెక్చరర్‌గా కూడా ఎంపికైంది.

Farmer Revenge: కార్ల షోరూమ్‌లో రైతుకు ఘోర అవమానం.. తర్వాత ఏం చేశాడో తెలిస్తే షాకవుతారు!



సునీత్ జీవితంలో స్థిరపడడంతో ఆమెకు మళ్లీ పెళ్లి చెయ్యాలని కమలా దేవి, దిలావర్ నిర్ణయించుకున్నారు. వరుడి కోసం అన్వేషణ ప్రారంభించి ఆడిటర్ ముఖేష్‌తో సునీతకు పెళ్లి నిర్ణయించారు. గత శనివారం దగ్గరుండి వారి పెళ్లి జరిపించారు. అత్తమామలను విడిచి వెళ్లేటపుడు సునీత కన్నీళ్లు పెట్టుకుంది. కోడలి పట్ల ఎంతో ఆదరణ చూపించిన కమలా దేవి, దిలావర్ దంపతులపై బంధుమిత్రులు ప్రశంసలు కురిపించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Rajastan, Women

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు