August 2020 Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు 10 సెలవులు... ఎప్పుడంటే

August 2020 Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు 10 సెలవులు... ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

August 2020 Bank Holidays | ఆగస్టులో బ్యాంకులకు 10 సెలవులు ఉండబోతున్నాయి. అంటే బ్యాంకులు పనిచేసేది 21 రోజులే. ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.

 • Share this:
  మీరు ఆగస్టులో ఏవైనా బ్యాంకు పనులు ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఏవైనా ఉన్నాయా? అయితే ముందుగానే బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఆగస్టులో రక్షా బంధన్, కృష్ణాష్టమి, గణేష్ చతుర్థి లాంటి ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. కాబట్టి సెలవులు ఎక్కువగానే ఉంటాయి. అందుకే సెలవులు ఎప్పుడు ఉన్నాయో తెలుసుకొని బ్యాంకు పనులు ప్లాన్ చేస్తే ఇబ్బందులు ఉండవు. ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు ఎలాగూ సెలవే. ఇవి కాకుండా పండుగులు కూడా ఉన్నాయి. కాబట్టి ఆగస్టులో మరిన్ని సెలవులు రాబోతున్నాయి. మొత్తం 10 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశముంది. మరి ఆగస్టులో ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలుసుకోండి.

  Personal Loans: అప్పు కావాలా? తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఈ బ్యాంకులు రెడీ

  UPI: యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసా?

  ఆగస్ట్ 1- బక్రీద్
  ఆగస్ట్ 2- ఆదివారం
  ఆగస్ట్ 8- రెండో శనివారం
  ఆగస్ట్ 9- ఆదివారం
  ఆగస్ట్ 11- కృష్ణాష్టమి
  ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే
  ఆగస్ట్ 16- ఆదివారం
  ఆగస్ట్ 22- నాలుగో శనివారం, వినాయక చవితి
  ఆగస్ట్ 23- ఆదివారం
  ఆగస్ట్ 30- ఆదివారం

  ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారాలతో పాటు మొత్తం 10 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అంటే ఆగస్టులో బ్యాంకులు పనిచేసేది 21 రోజులు మాత్రమే. ఈ సెలవులను దృష్టిలో పెట్టుకొని మీ పనుల్ని ప్లాన్ చేసుకోండి.
  Published by:Santhosh Kumar S
  First published: