Sad: ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’ వీడియోతో వైరల్ అయిన యువకుడిపై దాడి.. ఎంతలా కొట్టారంటే..

వీడియోలో సదరు యువకుడు

సోషల్ మీడియా‌లో ఎప్పుడు.. ఎవరు.. ఎలా.. ఫేమస్ అవుతారో వైరల్ అయ్యేంతవరకూ వాళ్లకే తెలియదు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు.. ఇంటర్నెట్‌లో ఒక్క వీడియో వైరల్ అయితే చాలు.. వాళ్లకు ఎక్కడ లేని క్రేజ్ వస్తోంది. బుల్లెట్ బండి పాట కంటే ఆ పాటకు స్టెప్పులేసిన పెళ్లి కూతురు వీడియో సోషల్ మీడియాలో ఎంతలా సందడి చేసిందో తెలిసిందే.

 • Share this:
  సోషల్ మీడియా‌లో ఎప్పుడు.. ఎవరు.. ఎలా.. ఫేమస్ అవుతారో వైరల్ అయ్యేంతవరకూ వాళ్లకే తెలియదు. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేసినట్టు.. ఇంటర్నెట్‌లో ఒక్క వీడియో వైరల్ అయితే చాలు.. వాళ్లకు ఎక్కడ లేని క్రేజ్ వస్తోంది. బుల్లెట్ బండి పాట కంటే ఆ పాటకు స్టెప్పులేసిన పెళ్లి కూతురు వీడియో సోషల్ మీడియాలో ఎంతలా సందడి చేసిందో తెలిసిందే. ‘నాది నక్కిలీసు గొలుసు’ అనే పాటకు తానేసిన స్పెప్పులతో దుర్గారావు అనే వ్యక్తి ఏకంగా రవితేజ సినిమాలోనే ఛాన్స్ కొట్టేశాడు. కామెడీ షోలు అయితే.. వాళ్లకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఏకంగా వాళ్లకు కామెడీ షో వేదికలపైనే అవకాశాలు ఇచ్చాయి. ఇలా ఈ మధ్య వైరల్ అయిన వీడియోల్లో ‘అయ్యయ్యో వద్దమ్మా’ వీడియో ఒకటి.

  ఆ యువకుడు వినాయక చవితికి చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయి అందరి నోళ్లలో నానాడు. ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’ అనే మాటలతో రాత్రికి రాత్రి ఎక్కడ లేని క్రేజ్‌ అతనికి సోషల్ మీడియాలో దక్కింది. అయితే.. సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినా నిజ జీవితంలో మాత్రం ఆ యువకుడికి ఊహించని కష్టం ఎదురైంది. ‘శరత్’ అనే ఆ యువకుడిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టారు. ఆ యువకుడి రక్తం కళ్లజూశారు. ఆ దాడిలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. కన్ను లోపలికి పోయి, ముక్కు పగిలి.. నోటి వెంట రక్తం వచ్చేలా ఆ యువకుడిని కొట్టారు. సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వ్యక్తులతో కొందరు ఈవెంట్స్ చేస్తుంటారు. అలా ఓ ఈవెంట్‌కు వెళ్లి వస్తున్న క్రమంలో ఈ యువకుడిపై దాడి జరిగినట్లు తెలిసింది.

  ఇది కూడా చదవండి: Shocking: అమ్మో.. ఇదెక్కడి ఘోరం.. వీడియో చూస్తుంటేనే ఏదోలా అనిపించింది.. ఓ తాగుబోతు కిరాతకం ఇది..

  ఇదిలా ఉంటే.. కొందరు మాత్రం ఇవన్నీ ఫేమస్ అయ్యేందుకు చేసే పనులంటూ కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం నిజంగా అతనిపై దాడి జరిగిందని చెబుతున్నారు. ఏదేమైనా.. ఆ యువకుడు గాయపడినట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఇన్‌స్టా రీల్స్‌లో ఆ యువకుడి ముఖంపై రక్తం కారుతున్న ఫొటోలను పోస్ట్ చేసి వెటకారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఆ యువకుడు ఏదో ఒక విధంగా క్రేజ్ తెచ్చుకున్నప్పటికీ దాని వల్ల అతనికి అంతగా ఒరిగే లాభం కూడా ఏమీ లేదు. మహా అయితే.. కొన్ని రోజులు అతని గురించి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటారు. ఎవరైనా ఈవెంట్స్ ప్లాన్ చేస్తే ఆ నాలుగు రోజులు ఇలాంటి వాళ్లను పిలిచి ఎంతో కొంత డబ్బు ముట్టజెప్పి ఈవెంట్‌లో సందడి చేసేలా చూస్తారు. ఆ తర్వాత ఇలాంటి వాళ్లను పట్టించుకునే వాళ్లే ఉండరు.

  ఇది కూడా చదవండి: Shameful Incident: 44 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ఓపెన్ చేసి ఇదేం పని.. మళ్లీ నుదుటిపై పెద్ద బొట్టొకటి..

  సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలతో వచ్చే క్రేజ్ నీటి బుడగ లాంటిది. అలాంటి వారిపై కక్షపూరితంగా దాడి చేసి, ద్వేషం పెంచుకోవడం తగని పని. ఏదేమైనా.. తనపై జరిగిన దాడి వల్ల ఈ యువకుడి గురించి సోషల్ మీడియాలో మరోసారి చర్చ నడుస్తోంది. ఇన్‌స్టాగ్రాంలో అతని దాడి ఫొటోలు వైరల్‌గా మారాయి. కొందరు మానవత్వంతో త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం ఎవరితోనో తప్పుగా ప్రవర్తించి ఉంటాడని, అందుకే ఈ యువకుడిపై దాడి జరిగి ఉండొచ్చని రకరకాలుగా ఊహించుకుంటున్నారు. ఈ దాడి ఘటనపై నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ యువకుడి ‘అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ’ వీడియోపై మీమ్స్ కూడా ఏ రేంజ్‌లో వచ్చాయో అందరికీ తెలిసిందే.
  Published by:Sambasiva Reddy
  First published: