హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

పాడైన ఏటీఎం అతడిని కోటీశ్వరుడిని చేసింది..ఫ్రీగా రూ.9కోట్లు వచ్చాయని జల్సాలు..చివరికి..

పాడైన ఏటీఎం అతడిని కోటీశ్వరుడిని చేసింది..ఫ్రీగా రూ.9కోట్లు వచ్చాయని జల్సాలు..చివరికి..

డాన్ సాండర్స్

డాన్ సాండర్స్

ఎవరి భవితవ్యం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఎవరిని ఎప్పుడు ఏ రకంగా అదృష్టం వరిస్తుందో ఎవరికీ తెలియదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఎవరి భవితవ్యం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. ఎవరిని ఎప్పుడు ఏ రకంగా అదృష్టం వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఆ వ్యక్తికి అలాంటిదే జరిగింది. ఓ ఏటీఎం అతని అదృష్టానికి తలుపులు తెరిచింది. అయితే తన అదృష్ట పరిమితిని దాటాడు. దీంతో ఆయన ప్రజల దృష్టిలో పడ్డాడు. తర్వాత కలలో పోలీసులు అతని కోసం వెతకడం ప్రారంభించారు.

ఆస్ట్రేలియా(Australia)కు చెందిన బార్ అటెండర్ డాన్ సాండర్స్..ఒక రోజు రాత్రి మద్యం సేవించి ఏటీఎం నుంచి రూ.10వేలు విత్ డ్రా చేసుకునేందుకు ఇంటి ఇంటి నుండి బయలుదేరి వెళ్లాడు. ఏటీఎంలో లావాదేవీ రద్దు సందేశం వచ్చింది. అయితే నగదు రావడం మొదలైంది. ATM లోపాన్ని తెలుసుకున్న అతను రూ. 68,000 విత్‌డ్రా చేయడానికి మళ్లీ ప్రయత్నించగా ఈసారి కూడా అతనికి డబ్బు వచ్చింది. మొదట తన బ్యాంక్ ఖాతాలో ఏదో పొరపాటు జరిగినట్లు భావించాడు, కానీ ఆ తర్వాత బ్యాంకు చేసిన తప్పును గుర్తించడానికి అతడికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆ తర్వాత అతను ATM లోపాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. అలా 5 నెలల్లో రూ. 9 కోట్లు ఆ ఏటీఎం నుంచి తీసుకున్నాడు. ఆశ్చర్యకరంగా, ఈ సమయంలో అతని బ్యాంకు ఖాతా నుండి ఒక్క రూపాయి కూడా తీసివేయబడలేదు, అతనికి నగదు వస్తూనే ఉంది.

సుడిగాడివే బ్రో : కారు క్లీనర్ గా పనిచేసే యువకుడికి లాటరీలో రూ.21 కోట్లు

అయితే ఊరికే ఇంత డబ్బులు రావడంతో డాన్ సాండర్స్ జల్సాలు చేయడం ప్రారంభించాడు. మహిళలతో ప్రైవేట్ జెట్‌లో పార్టీకి 44 లక్షలు ఖర్చుబెట్టి వెళ్లాడు. నగరంలోని ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లేవాడు, పబ్‌లో మద్యం సేవించి విపరీతంగా డబ్బు ఖర్చు చేసేవాడు. ఈ సమయంలో అతను స్నేహితుడికి విశ్వవిద్యాలయ ఫీజు కూడా చెల్లించాడు. అయితే దీని తరువాత, డాన్ తన లో లోపల ఈ దొంగతనానికి భయపడుతున్నాడు. పోలీసులు వెంటాడుతున్నట్లు కలలో రోజు రావడంతో థెరపిస్ట్ వద్దకు వెళ్లి జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించాడు. పోలీసులకు లొంగిపోవాలని థెరపిస్ట్ డాన్ కి సూచించాడు. అతడి సూచన మేరకు డాన్ సాండర్స్ పోలీసులకు లొంగిపోయాడు. డాన్ 2016లో జైలు నుండి విడుదలయ్యాడు. ఇప్పుడు 1 గంటకు రూ. 1000 జీతంతో మళ్లీ బార్ అటెండర్ గా పనిచేస్తున్నాడు. అతని ఆసక్తికరమైన కథాంశంతో సినిమా తీయాలనే చర్చ కూడా జరుగుతోంది. టీవలి పోడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో డాన్ సాండర్స్ తన జీవితంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని ప్రజలకు వివరించాడు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: ATM, Australia, VIRAL NEWS

ఉత్తమ కథలు