• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • AT 62 MUMBAIS DANCING DADI IS SMASHING STEREOTYPES AND FLOORING THE INTERNET WITH HER MOVES BA GH

ఇన్ స్టాలో 62 ఏళ్ల బామ సంచలనం.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు.. ఏంటామె గొప్పతనం?

ఇన్ స్టాలో 62 ఏళ్ల బామ సంచలనం.. ఫిదా అయిపోతున్న నెటిజన్లు.. ఏంటామె గొప్పతనం?

ముంబై డాన్సింగ్ దాదీగా పేరుపొందిన రవి బాల శర్మ

తమ జీవితంలో వయసు అనేది కేవలం ఓ నంబర్ మాత్రమే అని నిరూపిస్తుంటారు చాలా మంది. మలి వయస్సులో కూడా తమకు ఇష్టమైన రంగాల్లో రాణిస్తుంటారు. తాము యవ్వనంలో ఉన్నప్పుడు కోల్పోయిన అవకాశాలను ముదిమి వయసులో మళ్లీ అందిపుచ్చుకుంటారు.

  • Share this:
తమ జీవితంలో వయసు అనేది కేవలం ఓ నంబర్ మాత్రమే అని నిరూపిస్తుంటారు చాలా మంది. మలి వయస్సులో కూడా తమకు ఇష్టమైన రంగాల్లో రాణిస్తుంటారు. తాము యవ్వనంలో ఉన్నప్పుడు కోల్పోయిన అవకాశాలను ముదిమి వయసులో మళ్లీ అందిపుచ్చుకుంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే తాజాగా సోషల్​ మీడియాలో ఓ బామ్మ ఓవర్​నైట్ సెలబ్రెటీగా మారిపోయింది. 62 ఏళ్ల రవి బాల శర్మ అనే ఈ బామ్మ చేసే డాన్స్​కు నెటిజన్లతో పాటు సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తన హావభావాలు, స్టెప్పులతో అదరగొడుతూ అందర్నీ మెప్పిస్తుంది. ఇన్​స్టాగ్రామ్​లో ‘డ్యాన్సింగ్​ దాదీ’ పేరుతో ఆమె డ్యాన్స్​ వీడియోలు తెగ వైరల్​ అవుతున్నాయి. రవిబాలా శర్మ.. ఉత్తరప్రదేశ్​లోని మొరాదాబాద్​లో జన్మించారు. చిన్నతనం నుంచే కళలపై మక్కువ ఉండేది. ఆ మక్కువతోనే తన తండ్రి శాంతి స్వరూప్ శర్మ నుండి కథక్​, తబలా, సంగీతం నేర్చుకున్నారు. ఆ తర్వాత, దిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో 27 సంవత్సరాల పాటు సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అయితే. తాను చిన్నతనంలో నేర్చుకున్న నృత్యం​పై ఆమెకు మక్కువ ఏమాత్రం తగ్గలేదు. దీంతో రిటైర్మెంట్​ తర్వాత మళ్లీ నృత్యం​ నేర్చుకోవడం మెదలుపెట్టింది.

ఓ ఆన్​లైన్ డాన్స్​​ పోటీల కోసం తొలిసారిగా తన డ్యాన్స్​ వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు రావడంతో మరిన్ని వీడియోలను పోస్ట్​ చేశారు రవిబాలా శర్మ. దీంతో, తక్కువ కాలంలోనే ఆమె పేరు సోషల్ ​మీడియాలో మార్మోగిపోయింది.
కాగా, బాలీవుడ్​ పాటలు, జానపద, భక్తి గీతాలతో పాటు భాంగ్రా పాటలకు కూడా ఎంతో చూడ ముచ్చటగా, ఆకట్టుకునే హావభావాలతో ఆమె చేసే డ్యాన్స్​కు నెటిజన్లు మాత్రమే కాదు దిల్జిత్​ దోసాంజ్, ఇంతియాజ్​అలీ లాంటి ప్రముఖులు సైతం ఫిదా అయ్యారు. వారు ఆమె వీడియోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేశారు. దీంతో అతి కొద్ది రోజుల్లేనే ‘డ్యాన్సింగ్​ దాదీ’గా నెట్టింట్లో స్టార్​గా మారారు. ప్రస్తుతం ఆమె ఇన్​స్టాగ్రామ్​ ఖాతాకు లక్ష మందికి పైగా ఫాలోవర్స్​ ఉన్నారు.
వయసు కేవలం సంఖ్య మత్రమే..
ఆమెకు దక్కిన సెలబ్రిటీ హోదా గురించి మాట్లాడుతూ ‘‘దిల్జిత్ దోసాంజ్ నా డాన్సింగ్​ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం పట్ల చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు అతిపెద్ద అవార్డుగా భావిస్తున్నా. నా దృష్టిలో వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. మీకున్న ప్రతిభతో జీవితంలోని ఏ దశలోనైనా గుర్తింపు పొందవచ్చు.”అని అన్నారు. రవిబాలా శర్మకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వారితో కలిసి ఆమె ముంబైలో నివసిస్తున్నారు. ఆమెకు టెక్నాలజీ తెలియదు కాబట్టి, ఆమె పిల్లలే డ్యాన్స్​ వీడియోలను సోషల్​మీడియాలో షేర్​ చేస్తుంటారు. అంతేకాక, పాటల ఎంపిక, కాస్ట్యూమ్స్​ విషయంలో కూడా వారే జాగ్రత్తలు తీసుకుంటారు. తన వీడియోలు పాపులర్​ కావడంపై రవిబాలా శర్మ సంతోషం వ్యక్తం చేస్తూ ‘‘వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. దాని కోసం మీ ఇష్టాలు, అభిరుచులను వదులుకోవద్దు. మీ జీవితంలో ఏ దశలోనైనా మీకు గుర్తింపు రావచ్చు. ఇందుకు నేనే ఓ ఉదాహరణ”అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:

అగ్ర కథనాలు