హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

US Elections 2020: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసిన ఆస్ట్రోనాట్.. అదెలా అనుకుంటున్నారా..?

US Elections 2020: అంతరిక్ష కేంద్రం నుంచి ఓటు వేసిన ఆస్ట్రోనాట్.. అదెలా అనుకుంటున్నారా..?

image credits : Twitter

image credits : Twitter

US Elections 2020: ఓట్ల పండుగ వచ్చిందంటే చాలు.. ఎక్కడున్న వాళ్లైనా వారికి ఓటు హక్కు ఉన్న ఊరికి వచ్చి ఓటేసి వెళ్తారు. మరి.. ఓటు వేసే వ్యక్తి ఈ భూగ్రహం మీదే లేకుంటే.. వాళ్లు ఓటేస్తే..? ఇదెలా సాధ్యం..?

 • News18
 • Last Updated :

  ప్రజాస్వామ్య దేశాలలో ఓటుకు ఉన్న విలువ అంతా ఇంతా కాదు. వందలాది మంది మేధావులు.. ఓటు విలువ, దాని ప్రాముఖ్యత గురించి ఎన్నో గ్రంథాలలో పుంఖానుపుంఖాలుగా రాశారు. అయితే భారత్ వంటి దేశాలలో అయితే ఓట్ల పండుగ వచ్చిందంటే ఆ హడావుడి మామూలుగా ఉండదు. ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు కూడా సొంత ఊరుకు వచ్చి ఓటు వేసి పోతారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలపుడైతే.. అభ్యర్థులే వారి ప్రయాణానికి డబ్బులిచ్చి మరీ రప్పిస్తారు. ఇక అమెరికా వంటి దేశాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాలా..? అంతా బాగానే ఉంది కానీ.. మరి ఓటు వేసే వాళ్లు ఈ భూగ్రహం మీద లేకుంటే..? అయినా వాళ్లు ఓటేస్తే..? ఇదెలా సాధ్యమనుకుంటున్నారా..? సాధ్యమే.

  అత్యంత అభివృద్ధి చెందిన అమెరికా సమాజంలో సాధ్యం కానిదంటూ ఏముంది. భూగ్రహం నుంచే కాదు.. ఏకంగా అంతర్జాతీయ స్పేస్ సెంటర్ నుంచే ఒక ఆస్ట్రోనాట్ అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేశారు. ఈ విషయాన్ని స్వయంగా నాసానే వెల్లడించింది. ఓటు వేసిన తర్వాత ఆ ఆస్ట్రోనాట్.. ‘నేను అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేశాను..’ అని దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


  ఈ మేరకు నాసా.. తన అధికారిక నాసా ఆస్ట్రోనాట్స్ ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్ని పంచుకుంది. అయితే అంతకుముందు అమెరికా ఆవల ఉంటున్న వారికి ఓటు వేసే హక్కు లేకపోయేది. కానీ 1997 నుంచి ఆ అవకాశం కల్పించేలా రాజ్యాంగ సవరణ చేశారు. దాని ప్రకారం... యూఎస్ వెలుపల సేవలందిస్తున్న సైనిక సభ్యులు, వారి కుటుంబాలకు అమెరిక అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేసే అవకాశం ఉంది. అంతరిక్ష కేంద్రాలలో పనిచేసేవారికీ ఈ సదుపాయం ఉంది. అయితే అంతరిక్ష కేంద్రం నుంచి ఓటువేసే వారు .. ముందుగా హారిస్ కౌంటీలోని ఒక కార్యాలయం నుంచి పంపించబడిన సురక్షితమైన ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తారు.

  తాజాగా ఓటు వేసిన ఆస్ట్రోనాట్ కేట్ రూబిన్స్.. అధ్యక్ష ఎన్నికలలో స్పేస్ సెంటర్ నుంచి ఓటు వేయడం ఇదే మొదటిసారి కాదు. అంతకుముందు ఎన్నికలలోనూ ఆమె ఇలాగే ఓటు వేసింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘ప్రతి ఒక్కరూ ఓటు వేయడం ఎంతో ముఖ్యం. మేం అంతరిక్షం నుంచి ఓటు వేసినప్పుడు.. భూమి మీదే ఉన్న ప్రజలు ఓటు వేయగలరని నేను నమ్ముుతున్నాను. ఇది మన ప్రజాస్వామ్యం లో చాలా కీలక ఘట్టం. అంతరిక్షం నుంచి ఓటు వేయడాన్ని గౌరవంగా భావిస్తున్నాను..’ అని ఆమె చెప్పారు. ఈనెల 14న రష్యాకు చెందిన ఆస్ట్రోనాట్స్ తోల కలిసి వెళ్లిన ఆరు నెలల సుదీర్ఘ మిషన్ లో.. రూబిన్ సభ్యురాలు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: US Elections 2020

  ఉత్తమ కథలు