హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Functions: పెళ్లిళ్లు, శుభకార్యాలలో కట్నంగా 100, 200, 500 కాకుండా.. రూ.101, 201,501 కానుకగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..?

Functions: పెళ్లిళ్లు, శుభకార్యాలలో కట్నంగా 100, 200, 500 కాకుండా.. రూ.101, 201,501 కానుకగా ఇస్తారు.. ఎందుకో తెలుసా..?

గిప్ట్ కవర్

గిప్ట్ కవర్

Wedding: మన సంప్రదాయాలలో చేసే పనులు, పాటించే నియమాల నిగూఢ అర్థం దాగి ఉంటుంది. అందుకే మన పెద్దలు కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు, నియమాలను పాటించాలని మనకు తరచుగా సూచిస్తుంటారు. ఇక వివాహాలలో కొంత మంది కట్నంగా డబ్బులను ఇస్తుంటారు.

Culture in our tradition given shagun as 101 201 501: మన దేశ సాంప్రదాయంలో ప్రతి ఒక ఆచారం వెనక ఒక గొప్ప అర్ధం దాగి ఉంటుంది. సాధారణంగా పెళ్లిళ్లలో కొంత మంది కొత్త జంటకు డబ్బులను కట్నంగా ఇస్తుంటారు. దీనిలో భాగంగా.. వారు.. రూ. 100 లేదా 500, 1000లను ఇవ్వకుండా, రూ. 101, 201, 501,1001 రూపాయాలను కవరులో పెట్టి చదివిస్తుంటారు. ఈ విధంగా డబ్బులను చదివిస్తుంటారు. ఇక మరికొందరు రకారకాల గిఫ్ట్ లను కానుకగా ఇస్తుంటారు.

అయితే, అతిథులు ఈ విధంగా, ప్రతి దాని చివర ఒకటి అంకె ఉండేలా చూసుకొవడం వెనుక ఒక మంచి కారణం దాగి ఉంది. రూపాయలు, 100, 200,500 వీటి చివరన సున్నా అంకె ఉంది. అంటే దానికి విలువ లేదు. అది అంతిమం అని సూచిస్తుంది. దీన్ని మన పెద్దలు నెగెటివ్ గా అంకెగా భావిస్తారు. అందుకే చివర సున్నాను ఉండకుండా చివరకు బేసి అంకె ఉండేలా చూస్తారు. ఇక మ్యాథ్స్ ప్రకారం.. 50,100,500 సంఖ్యలు.. అంకెలతో విభజించబడతాయి.

కానీ అదే.. 101,1001 వంటి సంఖ్యలు మాత్రం విభజించబడవు. మనం ఇచ్చేది ఏదైన వారికి ఎండింగ్, ఫైనల్ అని సూచించకూడదు. అదే విధంగా ఏదైన ప్రారంభంకావాలంటే.. ఒకటి అంకె ముందు ఉంటుంది. అందుకే ఒకటి ఉండేలా చూసుకుని డబ్బులు చదివిస్తారు. అదే విధంగా, ఒకటిని నంబర్ వన్ సంఖ్యను గెలుపుకు సూచకంగా, శుభ సంఖ్యగా కూడా భావిస్తారు.

ఇక సున్నా మాత్రం దీనికి విరుద్ధంగా ముగింపును సూచిస్తుంది. అందుకే శుభకార్యాలలో... కట్నంగా డబ్బులు ఇచ్చే చివర సున్నా కాకుండా.. ఒకటి సంఖ్య ఉండేలా చూసుకుంటారు. దీన్ని చాలా మంది దీన్ని పాటిస్తారు. కొందరు దేవాలయాలలో డబ్బులు విరాళాల రూపంలో ఇచ్చేటప్పుడు కూడా చివరకు ఒకటి అంకే ఉండేలా చూసుకుంటారు. కొన్ని చోట్ల వేలం పాటలో కూడా చివరకు ఒక అంకే ఉండేలా వేలంను నిర్వహిస్తారు.

First published:

Tags: Gifts, Money, VIRAL NEWS, Wedding

ఉత్తమ కథలు