భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఏం జరగబోతోంది?

భూమి చుట్టూ తిరుగుతున్న కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే తక్కువ దూరానికి ఈ గ్రహశకలం రానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

news18-telugu
Updated: September 24, 2020, 12:29 PM IST
భూమి వైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం.. ఏం జరగబోతోంది?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భూమి వైపు స్కూలు బస్ సైజులో ఉన్న ఒక గ్రహశకలం దూసుకొస్తుంది. కొత్తగా కనుగొన్న ఈ గ్రహశకలం భూమికి 13,000 మైళ్లు (22,000 కిలోమీటర్లు) చేరువగా వస్తోంది. భూమి చుట్టూ తిరుగుతున్న కమ్యూనికేషన్ శాటిలైట్ల కంటే తక్కువ దూరానికి ఈ గ్రహశకలం రానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భూమికి అతి చేరువగా వచ్చే స్థానం సౌత్ ఈస్ట్ పసిఫిక్ మహాసముద్రం. గురువారం ఆ స్థానానికి గ్రహశకలం వస్తుందని నాసా శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. కానీ దీనితో భూమికి పెద్ద సమస్య ఉండే అవకాశం లేదు. ఇది సురక్షితంగా భూ కక్ష్యను దాటి వెళ్లిపోతుందని నాసా గురువారం తెలిపింది. ఆ పరిధి దాటి వెళ్లిన తరువాత 2041 వరకు మళ్లీ అది భూమివైపు వచ్చే అవకాశాలు లేవని వెల్లడించింది.

* పరిమాణం ఎంత?

ఈ గ్రహశకలం పొడవు 15 నుంచి 30 అడుగుల (4.5-9 మీటర్లు) మధ్య ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉల్కల పరంగా చూస్తే దీని సైజు చాలా తక్కువగా ఉన్నట్టు భావించాలి. ప్రతి సంవత్సరం లేదా రెండేళ్లకోసారి ఈ పరిమాణంలోని గ్రహశకలాలు భూమి వాతావరణంలోకి వచ్చి కాలిపోతాయని నాసా జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీలోని సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డైరెక్టర్ పాల్ చోడాస్ చెప్పారు. దాదాపు 100 మిలియన్ల గ్రహశకలాలు విశ్వంలో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

* ప్రమాదం ఉందా?
భూమిపైపు దూసుకొచ్చే అంతరిక్ష వ్యర్థాల ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం లేదని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) తెలిపింది. సాధారణంగా ఇలాంటి చిన్న గ్రహశకలాలతో పెద్దగా ముప్పు ఉండదు. కానీ పెద్ద సైజులో ఉండే వాటితో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటి గమనాన్ని శాస్ర్తవేత్తలు ముందుగానే అంచనా వేయగలుగుతారు. వాటి ద్వారా వచ్చే ప్రమాదాలను కూడా ముందు నుంచే అంచనా వేయవచ్చు. ఈ గ్రహశకలాన్ని అరిజోనా విశ్వవిద్యాలయంలోని కాటాలినా స్కై సర్వే గత శుక్రవారం కనుగొంది. దీనికి 2020 SW అనే పేరు పెట్టారు. రాబోయే 100 సంవత్సరాల వరకు వీటివల్ల భూమికి ఎలాంటి ముప్పు జరగదని నాసా శాస్ర్తవేత్తలు తేల్చి చెప్పారు. గతంలో 465824 2010 FR అనే గ్రహశకలం సెప్టెంబర్ 6న భూమి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని నాసా భావించింది. అప్పటి నుంచి నాసా ఆస్టరాయిడ్ వాచ్ ఇలాంటి గ్రహశకలాలపై పరిశీలన చేస్తోంది.

* ఊహాగానాలను నమ్మొద్దు
ఇప్పటికే ప్రపంచం మొత్తం అంతమవుతుందని చాలామంది వ్యక్తులు, వార్తా సంస్థలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వీటిని నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. గ్రహశకలాల గురించి సమాచారం తెలియగానే కొంతమంది సంబంధంలేని ఊహాగానాలను ప్రచారం చేస్తారు. వాటి కారణంగా పెద్ద ప్రమాదాలు జరుగుతాయని చెప్తారు. ఇలాంటివన్నీ అబద్ధాలని మేము ప్రజలకు చెబుతున్నాం. వీటివల్ల ఎవరికీ ఎలాంటి ముప్పు ఉండదు అని నాసా ఆస్టరాయిడ్ వాచ్ తెలిపింది. సూర్యుడి నుంచి 1.3 సాస్ర్టనామికల్ యూనిట్ల వరకు వచ్చే గ్రహశకలాలను నీయర్ ఎర్త్ ఆబ్జెక్టులుగా (NEO)పరిగణిస్తారు. వీటితో భూమికి ఎలాంటి ప్రమాదం ఉండదు.
Published by: Shiva Kumar Addula
First published: September 24, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading