• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • ASSAMESE NANDI SISTERS AGAIN CONQUER SOCIAL MEDIA WITH MALAYALAM SONG KUTTANADAN PUNCHA WATCH IT HERE NK

Viral video: అసోం నంది సిస్టర్స్... మళ్లీ వచ్చేశారు... మలయాళ సాంగ్‌కి అదిరే రెస్పాన్స్

Viral video: అసోం నంది సిస్టర్స్... మళ్లీ వచ్చేశారు... మలయాళ సాంగ్‌కి అదిరే రెస్పాన్స్

అసోం నంది సిస్టర్స్ (image credit - youtube)

Viral video: కరోనా వచ్చాక... రెగ్యులర్ షోలు లేకపోవడంతో... తమ టాలెంట్ చూపించేందుకు ఒక్కొక్కరూ ఒక్కో మార్గం ఎంచుకుంటున్నారు. అలా అసోం నంది సిస్టర్స్... బాల్కనీ సాంగ్స్‌తో దుమ్మురేపుతున్నారు.

  • Share this:
    Viral video: తప్పుగా పాడితే క్షమించండి... అంటూ... అసోం నంది సోదరీమణులు.. అంతర నంది, అంకిత నంది మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా వీళ్లు పాడుతున్న మలయాళం సాంగ్స్ వీర వైరల్ అవుతున్నాయి. తాము అసోంకి చెందిన వాళ్లం అని చెబుతూనే... వీళ్లు.. మలయాళ పాటల్ని అవలీలగా పాడేస్తున్నారు. తమకు మలయాళం రాదనీ... అందువల్ల తాము తప్పులతో పాడితే ఏమీ అనుకోవద్దని అంటున్నారు.... కానీ వీరు పాడే పాటను వింటూ ఉంటే... అందులో తప్పులు వెతకడం అనేదే ఉండదు. ఆ పాటలో లీనమైపోతామంతే. అందుకే ఈ అసోం సిస్టర్స్‌కి సోషల్ మీడియాలో అదిరే రెస్పాన్స్ ఉంది.

    నంది సిస్టర్స్‌గా వీళ్లు ఫేమస్. ఇలా బాల్కనీలోనే పాటలు పాడుతారు. ఆ పాడల్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. ప్రతీ పాటా వైరల్ అవుతోంది. వీళ్ల మరో ప్రత్యేకత ఏంటంటే... వీళ్లు వెస్ట్రన్‌ లుక్‌లో కనిపిస్తారు. ఇండియన్ వేర్లలోనూ కనిపిస్తారు. పాటకు తగిన కాస్టూమ్ వేసుకుంటారు. భారతీయ మహిళల లాగా... నగలు, పూలు, చీరకట్టు అన్నీ అలాగే మెయింటేన్ చేస్తారు. అందుకే వీళ్లంటే నెటిజన్లకు చాలా ఇష్టం. ఆ పాటలు మీరే చూడండి, వినండి.

    తాజాగా "కుంజిపెన్నే నీ కంటే నేను చాలా అందంగా ఉన్నాను" మలయాళ పాటతో షో ప్రారంభించారు. ఆ తర్వాత... మలయాళీల ఆల్‌టైమ్ ఫేవరెట్ సాంగ్ "అప్పోలే పరన్నిల్లే" పాడేశారు. నెక్ట్స్ "కుట్టనాదన్ పంచయిలే" పాటతో కట్టిపడేశారు. ప్రతీ పాటనూ అంతే అందంగా పాడుతున్నారు.

    ఈ పాటలు పాడేందుకు వీరు కొందరు కేరళ ఫ్రెండ్స్ నుంచి సాయం పొందారు. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఐతే... వీరు మలయాళీ పాటలు పాడటం ఇదే తొలిసారి కాదు... ఇంతకుముందు ఎంతమ్మేదే జిమ్మీ కిమ్మెల్ పాడారు. అది చూసి చాలా మంది ఎంజాయ్ కేరళీయులు చేశారు. ఓ నెటిజన్... ఐ యామ్ సారీ అని చెప్పడమే తప్పు అంటూ వీరిని మెచ్చుకున్నారు.

    లాక్‌డౌన్ సమయంలో వీరు ఇలా తమ ఇంటి బాల్కనీలో సాంగ్స్ పాడుతూ... అందర్నీ అలరిస్తున్నారు. అంతర నంది... అసోంకి చెందిన పాపులర్ ప్లే బ్యాక్ సింగర్. అంతర నంది... సీటీవీ 2009లో నిర్వహించిన సరిగమప ఛాంపియన్స్‌లో... ఫైనల్‌లో టాప్ త్రీలో నిలిచింది. అంకిత నంది కూడా సింగరే. తన సోదరితో కలిసి హాయిగా పాడేస్తోంది.

    ఇప్పుడు వీరు బెంగాలీ, మరాఠీ, హిందీ, మలయాళ పాటలు పాడుతున్నారు. వీళ్లను మలయాళీలు ఎక్కువగా ఫాలో అవుతుంటే.... వారి కోసం మలయాళీ పాటలు పాడారు. ఐతే... కేరళలో ఇలా పాడేవారు తక్కువగా ఉన్నారు. వారికి వీళ్లు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీళ్లకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఏ ఆర్ రెహ్మాన్ ఆదర్శం. అంతర నంది ఇప్పటికే... కొన్ని షోలలో ఏఆర్ రెహ్మాన్‌ను కలిసింది.

    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ రాశుల వారు ఫుడ్ లవర్స్... స్వీట్స్, కేక్స్ అంటే తెగ ఇష్టపడతారు

    అంకిత నంది ఇంటర్ పాసైంది. చాలా సీరియల్స్‌కి టైటిల్ ట్రాక్స్‌కి వాయిస్ ఇస్తోంది. ఈ సిస్టర్స్... చెన్నైలోని KM మ్యూజిక్ కన్సర్వేటరీలో వెస్ట్రన్ క్లాసికల్ వోకల్స్ కూడా నేర్చుకున్నారు.
    Published by:Krishna Kumar N
    First published: