హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ట్రక్కును ఢీకొన్న భారీ ఖడ్గమృగం.. షాకింగ్ కు గురైన డ్రైవర్.. వీడియో వైరల్..

ట్రక్కును ఢీకొన్న భారీ ఖడ్గమృగం.. షాకింగ్ కు గురైన డ్రైవర్.. వీడియో వైరల్..

ట్రక్కును ఢీకొన్న ఖడ్గమృగం

ట్రక్కును ఢీకొన్న ఖడ్గమృగం

Viral video: రోడ్డుమీద వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. ఆ మార్గం అడవికి దగ్గరగా ఉంది. ఇంతలో చెట్ల మధ్య నుంచి ఒక భారీ ఖడ్గమృగం పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Assam, India

కొన్నిసార్లు జంతువులు రోడ్ల మీదకు వస్తుంటాయి. అవి ఒక మార్గం నుంచి మరోక మార్గానికి వెళ్తుంటాయి. అడవికి దగ్గరగా ఉండే హైవేల దగ్గర జంతువులు రోడ్లమీదకు వస్తుంటాయి. మనం జింకలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, చిరుతలు, పాములు, కొండ చిలువలు తరచుగా రోడ్ల మీదకు రావడం చూస్తుంటాం. ఇలాంటి ఎన్నో వీడియోలు గతంలో వైరల్ గా మారాయి. తాజాగా మరో వీడియోను ఏకంగా అస్సాం సీఎం సోషల్ మీడియాలో (Social media)  పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ గా (Viral video)  మారింది.

పూర్తి వివరాలు.. అస్సాంలోని (Assam) ధుబ్రి జిల్లాలోని హల్ది బారి వద్ద ఉన్న ప్రదేశంలో ఈ ఘటన సంభవించింది. రోడ్డుకు ఇరువైపులా పచ్చగా అడవి ఉంది. ఇంతలో.. అడవిలో నుంచి ఒక భారీ ఖడ్గమృగం రోడ్డు మీదకు వచ్చింది. అప్పుడు రోడ్డు మీద భారీ వాహనాలు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఖడ్గమృగం రోడ్డు మీద వెళ్తున్న ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీన్ని గమనించని ట్రక్ డ్రైవర్ వెంటనే ట్రక్ ను మరోవైపు నుంచి వెళ్లనిచ్చాడు. కానీ అప్పటికే అది ట్రక్కును ఢీకొట్టింది.

ట్రక్ వెనుకాలే.. మరో కారు కూడా రావడం కన్పిస్తుంది. ఖడ్గమృగం మరలా వచ్చిన దారిలోనే అడవిలోనికి వెళ్లడానికి ప్రయత్నించింది. కానీ అక్కడ ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. ఆ తర్వాత మరల అడవిలోకి వెళ్లిపోయింది. ఈ వీడియోను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sarma) సోషల్ మీడియాలో (social media) షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ గా మారింది.

ఇదిలా ఉండగా అడవిలో ఒక భారీ కొండ చిలువ (Python)  చెట్టుదగ్గరకు చేరుకుంది. ఆ తర్వాత.. తన తొకను బ్యాలెన్స్ చేసుకుని చెట్టు బెరడుపైకి ఎక్కింది. అది అచ్చం కల్లుగీతా కార్మికుడు చెట్టు ఎక్కినట్లే పైకి గబాగబా పాకుతూ ఎక్కేసింది. అది తన తోకను ఆధారంగా చేసుకుని చెట్టును చుట్టేసుకుంది.

ఆ తర్వాత.. కొండ చిలువ మెల్లగా తోకతో పైకి ఎక్కింది. ఇలా తోకతో తన దేహన్ని ముందుకు నెట్టుకుంటూ పొడవైన చెట్టుపైకి సునాయాసంగా ఎక్కేసింది. ఈ సంఘటన గతంలోనే జరిగింది. తాజాగా, మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా (Viral video)  మారింది.

First published:

Tags: Assam, Viral Video

ఉత్తమ కథలు