హిందూ మిత్రుడి కోసం ముస్లిం రక్తదానం.. రంజాన్ దీక్షను బ్రేక్ చేసి..

పలావుల్లా అహ్మద్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మిత్రుడి కోసం అతడు చేసిన త్యాగాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

news18-telugu
Updated: May 12, 2019, 5:59 PM IST
హిందూ మిత్రుడి కోసం ముస్లిం రక్తదానం.. రంజాన్ దీక్షను బ్రేక్ చేసి..
రక్తదానం చేస్తున్న పలావుల్లా అహ్మద్
  • Share this:
ముస్లింలకు రంజాన్ ఎంతో పవిత్రమాసం. ఈ నెలలో వారు కచ్చితంగా ఉపవాస దీక్ష చేస్తారు. అత్యంత నియమ నిష్టలతో రంజాన్ ఉపవాస దీక్షను చేపడతారు. ఎంత ఇబ్బంది వచ్చినా.. ఉపవాస దీక్షను మాత్రం విరమించడానికి అంగీకరించరు. అయితే, తన స్నేహితుడి ప్రాణాన్ని కాపాడడం కోసం రంజాన్ ఉపవాస దీక్షను విరమించి మరీ రక్తదానం చేశాడో ముస్లిం యువకుడు. అసోంలోని మంగలోదోయ్‌లో ఈ ఘటన జరిగింది. పలావుల్లా అహ్మద్ అనే యువకుడు ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తూ ఉంటాడు. అదే ఆస్పత్రిలో తన స్నేహితుడు తపోష్ గొగోయ్‌ అనారోగ్యంతో చేరాడు. తపోష్ గొగోయ్‌కి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. అందుకు బీ పాజిటివ్ బ్లడ్ అవసరం పడింది. ఆ సమయంలో ఆస్పత్రిలో బ్లడ్ అందుబాటులో లేదు. దీంతో వెంటనే పలావుల్లా అహ్మద్ ముందుకొచ్చాడు.

బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత వైద్యులు తక్షణ శక్తి కోసం ఓ ఫ్రూటీనో, లేకపోతే జ్యూస్ అందిస్తారు. అయితే, రంజాన్ ఉపవాస దీక్షలో ఉండగా, పగటిపూట ఆహారం తీసుకోవడం నిషేధం. ఉపవాస దీక్షలో ఉన్న పలావుల్లా అహ్మద్ తన దీక్షకు ఇబ్బంది లేకుండా రక్తదానం చేద్దామని అనుకున్నాడు. అయితే, రక్తదానం చేసిన తర్వాత వెంటనే ఏదైనా తక్షణ శక్తిని ఇచ్చే ఆహారం తీసుకోకపోతే సమస్య వస్తుందని తెలిసి తన దీక్షను విరమించాడు.

పలావుల్లా అహ్మద్ చేసిన పనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మిత్రుడి కోసం అతడు చేసిన త్యాగాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే, తనను పొడగాల్సిన అవసరం ఏముందంటున్నాడు అహ్మద్. ‘మొదట జీవితం, ఆ తర్వాతే మతం, కులం’ అంటున్నాడు అహ్మద్.

First published: May 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...