సరిహద్దుల్లో దేశం కోసం యుద్ధం చేస్తోన్న సైనికులకు సైతం ప్రేరణ ఇచ్చే ఈ దేశభక్తి గీతాలు ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని రగిలిస్తాయి. ముఖ్యంగా.. అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన కేసర్ సినిమా దేశభక్తిని ప్రోత్సహించే చిత్రాల్లో ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు. అనురాగ్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలోని తేరి మిట్టి ( Teri Mitti song from Kesar) అనే పాటకు ఆర్కో మ్యూజిక్ కంపోజ్ చేయగా ప్రముఖ గాయకుడు బి ప్రాన్ ఆలపించారు. 2019లో ఈ సినిమా సూపర్ హిట్ కాగా.. సోషల్ మీడియాలో ఈ పాట పెను సంచలనం సృష్టించింది. అయితే, ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అస్సాంకు చెందిన చిన్నారి ఈ పాటను పాడింది. ఇప్పుడు ఆ పాట వైరల్ గా మారింది. యూట్యూబ్ లో ఆ వీడియోను తెగ చూసేస్తున్నారు. ఆ వీడియోకు తెగ లైకుల వర్షం కురుస్తోంది.వివరాల్లోకెళితే.. అస్సాంకి చెందిన కల్మావిజో మార్ (Kalmawizo Hmar) అనే చిన్నారి అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటించిన కేసర్ సినిమాలో తేరి మిట్టి సాంగ్ ను ( Teri Mitti song from Kesar)ఆలపించింది. ఆ వీడియోను యూట్యూబ్ వేదికగా రిలీజ్ చేశారు. 3.49 నిమిషాల గల ఆ వీడియోలో చిన్నారి తేరి మిట్టి పాటను ఆలపిస్తోంది. కల్మావిజో పాడిన ఆ పాటను వింటే కచ్చితంగా రోమాలు నిక్కబోడుచుకోవాల్సిందే. మీరు కూడా ఆ పాటను వింటే ఆ మాటే అంటారు.
"దేశం కోసం సైనికుల చేసే త్యాగాలను ఈ పాట ద్వారా మరోసారి గుర్తుచేసుకుంటున్నాం. దేశం కోసం కుటుంబాన్ని, సొంతవారిని విడిచిపెట్టి.. దేశ సరిహద్దుల్లో ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా సైనికులు పనిచేస్తున్నారు. అలాంటి దేశ హీరోలకు ఈ పాట ద్వారా సెల్యూట్ చేస్తున్నాం " అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akshay Kumar, Trending, Viral Video, Youtube