యూపీ సీఎం యోగికి షాక్ ఇచ్చిన ఏషియాడ్ విన్నర్ సుధా సింగ్!

చెక్ తీసుకునేందుకు నిరాకరణ... ‘డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి ఎందుకివ్వరని...’ గవర్నర్, సీఎంలను స్టేజ్ మీదే నిలదీసిన అథ్లెట్...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: October 4, 2018, 12:19 PM IST
యూపీ సీఎం యోగికి షాక్ ఇచ్చిన ఏషియాడ్ విన్నర్ సుధా సింగ్!
సుధా సింగ్ (పాత ఫోటో)
  • Share this:
ఏషియాడ్ 2018లో 3 వేల మీటర్ల స్టీప్ ఛేజింగ్ ఈవెంట్‌లో రజత పతకం సాధించిన అథ్లెట్ సుధాసింగ్... యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు ఊహించని షాక్ ఇచ్చింది. 2010 ఏషియాడ్‌లో 9.39.69 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం సాధించిన సుధాసింగ్‌... గత ఏషియాడ్‌లో రజతంతో సరిపెట్టుకుంది. భూటాన్‌లో శిక్షణ పొందిన సుధాసింగ్‌ ప్రస్తుతం యూపీ క్రీడాశాఖలో రీజనల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తోంది. అయితే డిప్యూటీ డైరెక్టర్‌గా పదోన్నతి కల్పించాలంటూ ఎప్పటి నుంచో అధికారులను కోరుతోంది సుధాసింగ్.

అయితే భారత అథ్లెట్ అభ్యర్థనను అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్రగవర్నర్ రామ్‌నాయక్, సీఎం ఆదిత్యనాథ్ ప్రత్యేక అథితులుగా ఆసియాడ్ పతక విజేతలకు నగదు బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమ వేదిక సాక్షిగా ప్రభుత్వంపై తన నిరసన వ్యక్తం చేసింది సుధాసింగ్. ఏషియాడ్‌లో పతకం నెగ్గినందుకు గాను సుధాసింగ్‌కు రూ. 30 లక్షలను ప్రోత్సాహకంగా ప్రకటించారు. అయితే చెక్ అందుకునేందుకు స్టేజ్ మీదకు చేరుకున్న సుధాసింగ్... తన పదోన్నతి గురించి నిలదీస్తూ... చెక్ అందుకునేందుకు నిరాకరించింది. ఈ హఠాత్ పరిణామానికి సీఎం యోగితో సహా అందరూ షాక్ అయ్యారు.

‘నేను కొన్నాళ్ల ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ ఇవ్వాలని కోరారు. సీఎం సార్ వెంటనే పదోన్నతి కల్పించాలని క్రీడాశాఖను ఆదేశించారు. అయినా ఇప్పటికీ నన్ను ఆ పదవిలో నియమించడం లేదు. నా పై అధికారులకు నాకు ప్రమోషన్ రావడం ఇష్టం లేదు. నాకు ఆ పదవి ఇవ్వకపోతే ఈ చెక్ నాకొద్దు. ఈ రాష్ట్రం కూడా వదిలి వెళ్లిపోతా...’ అంటూ సుధాసింగ్ గట్టిగానే నిలదీసింది. దీంతో ఏం జరుగుతుందో అర్థం చేసుకునేందుకు కొద్ది సమయం తీసుకున్న యోగి, రామ్‌నాయక్... కార్యక్రమాన్ని కొద్దిసేపు నిలిపేశారు. చెక్ తీసుకోకుండానే వేదిక దిగి వెళ్లిపోయింది సుధాసింగ్.

అయితే గవర్నర్ రామ్‌నాయక్, సుధాసింగ్ దగ్గరికి వెళ్లి ఆమెకు నచ్చజెప్పారు. పదోన్నతి వచ్చేలా తాను చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే డిప్యూటీ డైరెక్టర్ పోస్ట్ పదోన్నతి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కిందకి రాదని చెబుతోంది క్రీడాశాఖ.

First published: October 4, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...