ఫ్లైట్ ఆలస్యం.. పండుగ చేసుకున్న ప్రయాణికులు..

విమానం ఆలస్యం కావడంతో అందులో ప్రయాణించాల్సిన ఛీర్ గాళ్స్ డ్యాన్స్‌లు చేస్తూ సరదాగా గడిపారు. ప్రయాణికులు కూడా వారితో జతకలిశారు.

news18-telugu
Updated: April 7, 2019, 6:08 PM IST
ఫ్లైట్ ఆలస్యం.. పండుగ చేసుకున్న ప్రయాణికులు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 7, 2019, 6:08 PM IST
‘మీరు ప్రయాణించాల్సిన విమానం వాతావరణం ప్రతికూలతల వల్ల ఆలస్యం అవుతుంది.’ అని ఎయిర్‌పోర్టులో ప్రకటన వినగానే ప్రయాణికులకు విసుగొచ్చేస్తుంది. ఎయిర్ లైన్స్‌ను తిట్టుకుంటారు. వెదర్ ఈ టైమ్‌లోనే ఇలా ఉండాలా? అని తిట్టుకుంటారు. అయితే, విమానం ఆలస్యం అయితే, ఆ సమయంలో ప్రయాణికులు తెగ ఎంజాయ్ చేశారు. దక్షిణ కరోలినాలోని మార్టిల్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అట్లాంటా సిటీకి వెళ్లాల్సిన స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానం వాతావరణం బాగోలేకపోవడంతో ఆలస్యమైంది. ఆ సమయంలో ప్రయాణికులు అందరూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. అదెలా అంటే, ఆ విమానంలో ఓ ఛీర్ గాళ్స్ బృందం కూడా ప్రయాణించాల్సి ఉంది. ఓ పోటీకి వారు హాజరుకానున్నారు. విమానం ఆలస్యం కావడంతో ఆ టీమ్ కూడా తమకు ప్రాక్టీస్‌గా ఉంటుందని ఎయిర్‌పోర్టులోనే డ్యాన్స్‌లు చేయడం మొదలు పెట్టారు.

ఆ సమయంలో స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ఉద్యోగి కూడా వారితో జతకలిశాడు. దీంతో ప్రయాణికులు కూడా కలసి వారితో స్టెప్పులు వేశారు. ఈ హంగామా మొత్తాన్ని ఛీర్ గాళ్ ఒకరు తన ట్విట్టర్ అకౌంట్‌లో వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోను స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కూడా షేర్ చేసింది. ‘తమ విమానాలు ఎప్పుడూ సరైన సమయంలోనే ప్రయాణిస్తాయి. ఇలాంటి సమయంలో మా ఉద్యోగి చూపిన చొరవ అభినందనీయం’ అని స్పందించింది.
First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626