Guinness World Records: మూడు రోజుల్లో 208 దేశాలను చుట్టేసిన మహిళ.. గత రికార్డు బద్దలు

మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమని మరోసారి నిరూపితమైంది. ఇదే విషయాన్ని యూఏఈకి చెందిన ఓ మహిళ మరోసారి రుజువు చేసింది.

news18-telugu
Updated: November 20, 2020, 3:55 PM IST
Guinness World Records: మూడు రోజుల్లో 208 దేశాలను చుట్టేసిన మహిళ.. గత రికార్డు బద్దలు
ఖవ్లా అల్ రోమైతి(Credit: Guinness World Record)
  • Share this:
Guinness World Records: మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమనే విషయాన్ని యూఏఈకి చెందిన ఓ మహిళ మరోసారి రుజువు చేసింది. అతి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టేసిన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వివరాలు.. యూఏఈకి చెందిన డాక్టర్ ఖవ్లా అల్ రోమైతి కేవలం మూడు రోజుల్లోనే ఏడు ఖండాలు చుట్టేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఫిబ్రవరి 13వ తేదీన ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం దగ్గర రోమైతి తన యాత్రను ముగించింది. కేవలం మూడు రోజుల 14 గంటల 46 నిమిషాల, 48 సెకన్లలో ప్రపంచం మొత్తం తిరిగేసింది. తన ప్రయాణంలో 208 దేశాలను సందర్శించింది. అయితే కరోనా వైరస్ లాక్‌డౌన్ ప్రారంభంతో ఆమె పర్యటన ఆగిపోయినట్టుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు తమ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.

ప్రపంచ రికార్డు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని రోమైతి తెలిపారు. ఇది తనకు దక్కిన గౌరవం అని చెప్పారు. ప్రతి ఒక్కరు తమ జీవితంలోని లక్ష్యాలను సాధించడానికి మార్గాన్ని వెతుక్కోవాలని సూచించారు. తలచుకుంటే ఏది అసాధ్యం కాదని పేర్కొన్నారు. "దాదాపు 200 దేశాలకు చెందినవారు యూఏఈలో నివసిస్తున్నారు. అందుకే నేను వారి దేశాలను సందర్శించి, వారి సంస్కృతులను తెలుసుకోవాలని అనుకున్నాను" అని రోమైతి తెలిపారు.

ఇంకా తన ప్రయాణంలో ఎదురైన అడ్డంకులను, అనుభవాలను కూడా రోమైతి పంచుకున్నారు. "నిరంతరం విమాన ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇందుకు చాలా ఓపిక కావాల్సి వచ్చింది. అనేక సందర్భాల్లో ప్రయాణాన్ని మధ్యలోనే వదిలిపెడదామని అనుకున్నాను. చివరకు తన అంతిమ లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రోత్సహించిన, సాయపడిన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ క్రెడిట్ దక్కుతుంది"అని రోమైతి పేర్కొన్నారు.

ఇక, ఇంతకు ముందు తక్కువ వ్యవధిలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన రికార్డు జూలీ బెర్రీ, కాసే స్టీవర్ట్ అనే ఇద్దరు ట్రావెలర్స్ పేరిట ఉంది. వారు ఏడు ఖండాలను 92 గంటల, 4 నిమిషాల 19 సెకన్లలో చుట్టివచ్చారు. ఇప్పుడు ఆ రికార్డును రోమైతి తన ఖాతాలో వేసుకున్నారు.
Published by: Sumanth Kanukula
First published: November 20, 2020, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading