Home /News /trending /

ARMY HELPS RESCUE 2 YEAR OLD FROM GUJARAT WELL VIDEO GOES VIRAL PAH

OMG: నిజంగా పిల్లాడు మృత్యుంజయుడు.. 300 అడుగుల లోతైన బోరు బావిలో పడిన కూడా..

రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న అధికారులు

రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న అధికారులు

Gujarat: అప్పటి వరకు పిల్లాడు పొలంలో తల్లిదండ్రులతో పాటు ఆడుకున్నాడు. ఇంతలో తమ కొడుకు గొంతు మూగబోయింది. తల్లి మనసు కలత చెందింది. చుట్టు ప్రక్కల వెళ్లి చూసింది. ఎక్కడ పసివాడు కన్పించలేదు.

పొలాలలో తరచుగా బోర్లను వేస్తుంటారు. కొన్ని సార్లు నీళ్లు పడతాయి. మరికొన్ని సార్లు నీళ్లు పడవు. అలాంటి వాటిని తిరిగే పూడ్చేయడం కానీ, దాని మీద ఏదైన రాయి పెట్టేయడం కానీ చేయాలి. కానీ చాలా మంది దీన్ని అసలు పట్టించుకొరు. నీళ్లు పడని బోరు బావులను అలాగే వదిలేస్తుంటారు. దీంతో అక్కడికి వెళ్లిన చిన్న పిల్లలు ప్రమాదాల్లో పడుతుంటారు. ఇప్పటికే అనేక మంది చిన్న పిల్లలు బోరు బావుల్లో ప్రమాదవశాత్తు పడిన సంఘటనలు కొకొల్లలు. కొన్ని సార్లు, అదృష్టవశాత్తు బతికినప్పటికి మరికొన్ని సార్లు చనిపోయిన సంఘటనలు జరిగాయి. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.





పూర్తి వివరాలు.. గుజరాత్ లో (Gujarat) అనుకోని సంఘటన జరిగింది. సురేంద్ర నగర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుదాపూర్ గ్రామంలో శివం అనే రెండేళ్ల పిల్లాడు తన తల్లిదండ్రులతో కలిసి పొలానికి వెళ్లాడు. వారు కూలీపనులు చేస్తుండగా పొలం గట్టున ఆడుకుంటున్నాడు. అయితే, అక్కడ ఒక బోరు వేసి ఉంది. కానీ అది క్లోజ్ చేసి లేదు. ఇది తెలియని పసివాడు.. ఆడుకుంటు వెళ్లి బోరుబావిలో (Bore well)  పడిపోయాడు. ఈ క్రమంలో ఎంత సేపటికి తమ పిల్లవాడి గొంతు విన్పించకపోవడంతో తల్లి టెన్షన్ ఫీలయ్యింది. వెంటనే అక్కడికి వెళ్లి కొడుకు కోసం వెతికింది. అక్కడే బోర్ బావి ఉంది. అందులో తమ పిల్లవాడు పడ్డాడని అనుకుంది.



బోర్ లో తొంగిచూసింది. అందులో నుంచి శబ్దాలు వస్తుండటంతో స్థానికులకు సమాచారం ఇచ్చింది. వెంటనే లోకల్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాగైన పసివాడిని కాపాడాలని అనుకున్నారు. ఆర్మీ అధికారులను రంగంలోని దించారు. వారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. కొత్త పరికరాలను తీసుకొచ్చారు. బోర్ బావిలో పరికరాలను దించారు.

బాలుడు 300 అడుగులో లోతున చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే పరికరాన్ని దింపారు. దాదాపు.. 40 నిముషాలు శ్రమించి పిల్లాడు శివంను ఒక కొక్కెం సహయంతో బైటకు తీశారు. తమ కొడుకు ప్రాణాలతో పైకి రావడంతో తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బితబ్బిపోయారు. బాలుడిని వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. బాలుడు ప్రాణాపాయం నుంచి బైటపడ్డట్లు తెలుస్తోంది. కాగా, కేవలం 40 నిముషాలలోనే ఆపరేషన్ విజయ వంతంగా పూర్తి చేసి పసివాడిని ప్రాణాలతో కాపాడిన ఆర్మీ అధికారులను స్థానికులు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారింది. 
Published by:Paresh Inamdar
First published:

Tags: Baby boy, Borewell, Gujarat, Viral Video

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు