ARMY CARRIES PREGNANT WOMAN TO HOSPITAL IN KNEE DEEP SNOW IN KASHMIR SU GH
Indian Army: మోకాలి లోతు మంచులో నిండు గర్భిణిని హాస్పిటల్‌కు తరలించిన ఇండియన్ ఆర్మీ
గర్భిణిని హాస్పిటల్‌కు తరలించిన ఇండియన్ ఆర్మీ (Photo: News18 via Ministry of Defense)
భారత సైన్యం పరాక్రమం ఎంతటి గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది ఇండియన్ ఆర్మీ.
భారత సైన్యం పరాక్రమం ఎంతటి గొప్పదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సేవలందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది ఇండియన్ ఆర్మీ. తాజాగా వైద్య సదుపాయాలు అందుబాటులో లేని ఒక మారుమూల ప్రాంతంలోని గర్భిణిని సైనికులు హాస్పిటల్‌కు తరలించిన సంఘటన కశ్మీర్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. కశ్మీర్‌లోని కుప్వారా సమీపంలోని కరాల్‌పురాలో ఉన్న ఆర్మీ సిబ్బందికి జనవరి 5న అర్ధరాత్రి ఒక ఫోన్‌కాల్ వచ్చింది. తన భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని మంజూర్ అహ్మద్ షేక్ అనే వ్యక్తి సైనికులకు చెప్పాడు. అప్పటికే ఆ ప్రాంతంలో భారీగా కురుస్తున్న మంచు కారణంగా తన భార్యను హాస్పిటల్‌కు తీసుకెళ్లలేకపోయానని వివరించాడు. తనకు సాయం చేయాలని కోరాడు. దీంతో క్షణాల్లోనే ఆర్మీ పోస్ట్ నుంచి సైనికులు అతడి ఇంటికి చేరుకున్నారు. మోకాలి లోతులో పేరుకుపోయిన మంచులోనే నిండు గర్భిణిని, వారి కుటుంబ సభ్యులను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాల్పురా ఆసుపత్రికి తరలించారు.
డాక్లర్లకు ముందుగానే సమాచారం ఇవ్వడంతో ప్రసవానికి ఏర్పాట్లు చేశారు. తరువాత ఆమెకు బాబు పుట్టినట్లు వైద్యులు తెలిపారు. ఆర్మీ సిబ్బంది మహిళను స్ట్రెచర్‌పై తీసుకెళ్తున్న వీడియోను రక్షణ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గత కొన్నిరోజులుగా కశ్మీల్ లోయలో భారీగా మంచు కురుస్తోంది. భారీ హిమపాతం కారణంగా ఇప్పటి వరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్, ఒక మహిళ చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. మంచువల్ల స్థానికుల ఇళ్లులు, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతింటున్నాయి.
Heavy snow in Kashmir brings unprecedented challenges for citizens, especially in higher reaches. Watch the Soldier & Awam fighting it out together by evacuating a patient to the nearest PHC for medical treatment. #ArmyForAwam#AmanHaiMuqampic.twitter.com/DBXPhhh0RP
— PRO Udhampur, Ministry of Defence (@proudhampur) January 7, 2021
* మొదటిసారి కాదు..
గత ఏడాది జనవరిలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఉత్తర కశ్మీర్‌లోని డార్డ్ పోరా గ్రామానికి చెందిన రియాజ్ మీర్ అనే వ్యక్తి తన భార్యకు పురిటి నొప్పులు వస్తున్నాయని, హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సాయం చేయాలని సైనికులను కోరాడు. దీంతో ప్రసవ వేదనతో బాధపడుతున్న మహిళను సైనికులు నడుము లోతులో పేరుకున్న మంచులో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. దీంతో తల్లీబిడ్డలిద్దరికీ ప్రాణభయం తప్పింది. వీరి ఇంటికి చేరుకోవడానికి సైనికులు ఐదు కిలోమీట్లర వరకు ట్రెక్కింగ్ చేయాల్సి వచ్చింది.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.