తుపాకి పట్టి శత్రువుతో పోరాడేందుకు సిద్దమైన దేశ ప్రధాని భార్య.. ఎక్కడో తెలుసా?

పక్కపక్కనే ఉన్న దేశాల మధ్య సరిహద్దు పంచాయతీ ఉండటం సహజమే. అలాంటి వివాదమే ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య కూడా చాలా ఏళ్లుగా నడుస్తోంది.

news18-telugu
Updated: October 29, 2020, 8:15 AM IST
తుపాకి పట్టి శత్రువుతో పోరాడేందుకు సిద్దమైన దేశ ప్రధాని భార్య.. ఎక్కడో తెలుసా?
అన్నా హకోబ్యాన్(Image-instagram/annahakobyan.official)
  • Share this:
పక్కపక్కనే ఉన్న దేశాల మధ్య సరిహద్దు పంచాయతీ ఉండటం సహజమే. అలాంటి వివాదమే ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ల మధ్య కూడా చాలా ఏళ్లుగా నడుస్తోంది. ఈ రెండు దేశాలు వివాదస్పద నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతంపై ఆదిపత్యం కోసం పోరు సాగిస్తున్నాయి. ఈ పోరులో వందలాది మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ పోరు ఇటీవలి కాలంలో మరింత ముదురుతోంది. వివాదస్పద నాగోర్నో-కరాబాఖ్‌కు దూరంగా ఉన్న ప్రాంతాలపై ఆర్మేనియా దాడులకు పాల్పడుతుంది అని అజర్‌బైజాన్ ఆరోపిస్తుంది. మరోవైపు ఆర్మేనియా ప్రధాన మంత్రి నికోల్ పషిన్యన్ మిలటరీలో చేరాల్సిందిగా పిలపునిచ్చారు. ఈ క్రమంలో ప్రధాని పషిన్యన్ భార్య అన్నా హకోబ్యాన్(42) సైన్యంలో శిక్షణ తీసుకునేందుకు సిద్ధమైంది. నాగోర్నో-కరాబాఖ్ ప్రాంతం కోసం పోరాడేందుకు 13 మంది మహిళల టీమ్‌లో సభ్యురాలిగా ఆమె మిలటరీలో చేరారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసిన హకోబ్యాన్.. మిలటరీ శిక్షణను ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

" కొద్ది రోజుల్లోనే మన మాతృభూమి కోసం శత్రువుతో యుద్ధం చేయడానికి సరిహద్దులకు వెళ్లబోతున్నాను. దేశ ఆత్మగౌరవాన్ని, దేశ భూభాగాన్ని శత్రువులకు వదులిపెట్టే సమస్యే లేదు"అని హకోబ్యాన్ పేర్కొంది. ఈ మేరకు లోకల్ మీడియా వార్తకథనాలు ప్రచురించింది. అలాగే ఆర్మేనియన్ ప్రజలు మిలటరీకి సేవలు అందించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. తమ మాతృభూమిని ఆర్మేనియన్ ప్రజలు ఏవిధంగా రక్షించుకుంటారో ప్రపంచానికి చూపెట్టాల్సిన సమయం ఇది అని అన్నారు.

Armenia PM Nikol Pashinyan, Anna Hakobyan, Anna Hakobyan Joins military training, Armenia-Azerbaijan Conflict, Nagorno-Karabakh, ఆర్మేని ప్రధాని నికోల్ పషిన్యన్, అన్నా హకోబ్యాన్, మిలటరీ ట్రైనింగ్‌లో చేరిన అన్నా హకోబ్యాన్, ఆర్మేనియా-అజర్‌బైజాన్ పోరు, నాగోర్నో-కరాబాఖ్
Image-instagram/annahakobyan.official


ఇక, జర్నలిస్ట్‌గా జీవితాన్ని ప్రారంబించిన హకోబ్యాన్.. దేశంలో అత్యంత సర్క్యూలేషన్ కలిగిన ఆర్మేనియన్ టైమ్స్‌కు ఎడిటర్‌గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా మై స్టెప్ చారిటబుల్ ఫౌండేషన్‌ను కూడా ఆమె నిర్వహిస్తున్నారు. మరోవైపు దేశ అధ్యక్షుడి భార్యగా హకోబ్యాన్‌కు ప్రథమ మహిళలన్న హోదా ఉంది. అంతేకాకుండా తన భర్త తీసుకునే నిర్ణయాలను హకోబ్యాన్ ప్రభావితం చేస్తారనే ప్రచారం కూడా ఉంది.
Published by: Sumanth Kanukula
First published: October 29, 2020, 8:06 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading