హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Pink lagoon: ఏరులై పారుతున్న పింక్ ద్రవం.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Pink lagoon: ఏరులై పారుతున్న పింక్ ద్రవం.. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

పింక్ ద్రవం

పింక్ ద్రవం

అర్జెంటీనా దేశంలోని పెటగోనియా ప్రాంతంలో ఒక మడుగు పింక్ ద్రవంతో నిండి పోయింది. చాలా ప్రకాశవంతమైన గులాబీ రంగు ద్రవంతో పారుతున్న ఆ మడుగు చూపరులను ఆకర్షిస్తోంది. కానీ ఆ పింక్ ద్రవం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు.

అర్జెంటీనా దేశంలోని పెటగోనియా ప్రాంతంలో ఒక మడుగు పింక్ ద్రవంతో నిండి పోయింది. చాలా ప్రకాశవంతమైన గులాబీ రంగు ద్రవంతో పారుతున్న ఆ మడుగు చూపరులను ఆకర్షిస్తోంది. కానీ ఆ పింక్ ద్రవం ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ మడుగు చూసేందుకు చాలా ఆహ్లాదకరంగా కనిపించినప్పటికీ.. దానిలో చాలా హానికరమైన రసాయనాలు ఉన్నాయి. చేపలు, రొయ్యలను కుళ్ళిపోకుండా భద్రపరిచేందుకు వాడిన ఒక రసాయనం కారణంగా ఈ నీళ్ల మడుగు గులాబీ కలర్ లోకి మారిపోయింది. చేపల ఫ్యాక్టరీలలో ఎక్కువగా ఉపయోగించే సోడియం సల్ఫేట్ కారణంగా కార్ఫో మడుగు పింక్ కలర్ గా మారిపోయిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. సాధారణంగా సోడియం సల్ఫేట్ ని యాంటీబ్యాక్టీరియల్ ప్రోడక్ట్ గా ఉపయోగిస్తారు. అయితే ఫిష్ ఫ్యాక్టరీలు సోడియం సల్ఫేట్ ను ఇష్టానుసారం వాడుకుంటూ మిగిలిన వ్యర్థాలను చూబుట్ నదిలోకి వదిలేస్తున్నాయి. దీనివల్ల ఆ నది పూర్తిగా కలుషితమై పింక్ కలర్ లోకి మారింది. ఆ నదిపై ఆధారపడిన పలు మడుగులు కూడా పింకుగా మారాయి. దీనితో చాలా మంది స్థానికులు రోత కంపు భరించలేక ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నది చుట్టూ కూడా అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని కొందరు కంప్లైంట్స్ ఇచ్చారు.

అయితే పర్యావరణ కార్యకర్త పాబ్లో లాడా నది కాలుష్యంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అక్కడి ప్రభుత్వ తీరును ఆయన దుయ్యబట్టారు. కాలుష్యాన్ని తగ్గించాల్సిన ప్రభుత్వమే కాలుష్యాన్ని పెంచుతుందని ఆయన అన్నారు. నదులను కలుషితం చేసేవారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వెళ్లగక్కారు. ప్రజలపై విషప్రయోగం చేసేందుకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. కార్ఫో మడుగు వారం రోజుల క్రితం గులాబీ రంగు లోకి మారిందని ఆయన అన్నారు. అయితే ఆదివారం రోజు కూడా ఆ మడుగు అదే వికృత రంగులో కనిపించిందని ఆయన తెలిపారు. హానికరమైన సోడియం సల్ఫేట్ ను నదిలోకి వదిలి పెట్టకూడదని పర్యావరణ ఇంజనీర్, వైరాలజిస్ట్ ఫెడెరికో రెస్ట్రెపో చెప్పుకొచ్చారు. అది చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు.

అయితే ట్రెలె అనే ఓ ఇండస్ట్రియల్ పార్క్ నుంచి కార్ఫో మడుగుకు వ్యర్థమైన నీరు పారుతుంటుంది. దీనివల్ల ఈ మడుగు దరిదాపుల్లో కూడా ఎవరూ ఆటలు ఆడరు. అయితే గతంలో కూడా ఈ మడుగులోకి భారీ ఎత్తున్న వ్యర్థ పదార్థాలు డంప్ చేశారు. దాంతో ఆ మడుగు పాలిపోయిన గులాబీ రంగులోకి మారింది. ఈ మడుగులో చేపల వ్యర్థపదార్థాలను పారబోయడానికి ట్రక్కులు వచ్చేవి. కానీ ఇప్పుడు స్థానికులు ట్రక్కులు ప్రయాణించే మార్గాలను మూసివేశారు. అయితే స్థానికులు నిరసనలు చేసినప్పటికీ అక్కడి ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మడుగులు ఎరుపురంగులో మారినా.. ఎటువంటి హానీ చేకూరదని ప్రభుత్వం తన తప్పును సమర్థించుకుంటోంది. విదేశీ కంపెనీలకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో అనుమతులు లభిస్తున్నాయి. దీంతో విదేశీ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యర్థాలను నదిలో పారబోస్తున్నాయి.

First published:

Tags: International news, Pink, VIRAL NEWS

ఉత్తమ కథలు