హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Archie Singh: మిస్ ట్రాన్స్ ఇంటర్నేషనల్‌ పోటీ రన్నరప్​గా సత్తా చాటిన భారతీయ ట్రాన్స్​ ఉమెన్​ ఆర్చీ సింగ్​..

Archie Singh: మిస్ ట్రాన్స్ ఇంటర్నేషనల్‌ పోటీ రన్నరప్​గా సత్తా చాటిన భారతీయ ట్రాన్స్​ ఉమెన్​ ఆర్చీ సింగ్​..

మిస్ ట్రాన్స్ ఇంటర్నేషనల్‌ పోటీ రన్నరప్​గా సత్తా చాటిన భారతీయ ట్రాన్స్​ ఉమెన్​ ఆర్చీ సింగ్​..

మిస్ ట్రాన్స్ ఇంటర్నేషనల్‌ పోటీ రన్నరప్​గా సత్తా చాటిన భారతీయ ట్రాన్స్​ ఉమెన్​ ఆర్చీ సింగ్​..

Archie Singh: సమాజం నుంచి ఎదురయ్యే వేధింపులు, వివక్షలను ధీటుగా ఎదుర్కొన్ని, ఇతరులతో పోలిస్తే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ట్రాన్స్​జెండర్లు. డాక్టర్లు, లాయర్లు, టీచర్లుగానే కాదు మోడలింగ్​లోనూ రాణిస్తూ అందరి చూపు తమవైపు తిప్పుకునేలా చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

సమాజం నుంచి ఎదురయ్యే వేధింపులు, వివక్షలను ధీటుగా ఎదుర్కొన్ని, ఇతరులతో పోలిస్తే తామేమీ తక్కువ కాదని నిరూపిస్తున్నారు ట్రాన్స్​జెండర్లు. డాక్టర్లు, లాయర్లు, టీచర్లుగానే కాదు మోడలింగ్​లోనూ రాణిస్తూ అందరి చూపు తమవైపు తిప్పుకునేలా చేస్తున్నారు. తాజాగా, దక్షిణ అమెరికాలోని కొలంబియాలో జరిగిన మిస్ ఇంటర్నేషనల్ ట్రాన్స్ 2021 పోటీల్లో భారత్​కు చెందిన 22 ఏళ్ల ఆర్చీ సింగ్ అనే ట్రాన్స్ వుమన్ 2వ రన్నరప్ నిలిచి అరుదైన ఘనత సాధించింది.​ మిస్​ ట్రాన్స్​ ఇంటర్నేషనల్​ పోటీల్లో 2వ రన్నరప్​గా నిలిచిన తొలి భారతీయ ట్రాన్స్ వుమన్​గా అరుదైన ఘనత సాధించింది ఆర్చీ సింగ్. ఈ విజయంతో ఆమె పేరు భారతదేశంలో, మొత్తం ట్రాన్స్​జెండర్​ కమ్యూనిటీలో మార్మోగిపోతుంది. ఆర్చీ సింగ్​ మోడలింగ్​ ప్రయాణం అంత సులభంగా ఏమీ జరగలేదు. ఆమె ఎన్నో అవమానాలను ఎదుర్కొని తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కోసం అహర్నిశలు కష్టపడింది. మోడలింగ్​లో ప్రవేశించిన రోజుల్లో​ తనకు ఎదురైన ఒక చేదు సంఘటనను గుర్తుచేసుకున్నారు. మోడలింగ్​లో రాణించాలని ఉందని, నేను ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో కొంత మంది నన్ను ‘నువ్వు నిజమైన, పరిపూర్ణ మహిళవు కాదు కదా’ అని అన్నారు.

ఇటువంటి ఎన్నెన్నో చేదు అనుభవాలు ఎదురైనా ఎక్కడా భయపడలేదు. ఇవి నాకు కొత్త కాదులే అన్నట్లుగా ముందడుగు వేశాను అన్నారామె. పదిహేడేళ్ల వయస్సులో తన సెక్సువల్​ ఐడెంటిటీని బయటపెట్టిన ఆర్చీ.. ఆపరేషన్​ చేయించుకొని పూర్తిగా అమ్మాయిలా మారిపోయింది. ఆ తర్వాత మోడల్​గా కెరీర్​ ఆరంభించి.. అంచెలంచెలుగా ఎదుగుతూ ఏకంగా మిస్​ ట్రాన్స్​ ఇండియా కిరీటం దక్కుంచుకుంది.

Archie Singh

నేనూ మహిళనే..

కెరీర్​ ప్రారంభంలో ఆర్చీ ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. నువ్వు నిజంగా మహిళవు కాదు కదా! అనేవారు. అయితే, ఆర్చీ వారి ప్రశ్నకు ధీటైన సమాధానాన్నే ఇచ్చేది. నేను మహిళనే.. ట్రాన్స్​ జెండర్​ అయినప్పటికీ ఒక స్త్రీకి ఉండే అన్ని గుణాలు నాలో ఉనాయి. నేను మహిళనే అని రుజువు చేసేందుకు ప్రభుత్వం నాకిచ్చిన ఐడీ కార్డు నా వద్ద ఉండి చూడాలనుకునేవారికి చూపిస్తాను.. ప్రభుత్వం ఇచ్చిన ఐడీ కంటే ఇంకేంకావాలి మీకు? నేను సర్జీరీ చేయించుకొని పూర్తిగా స్త్రీగా మారిపోయాను అంటూ ధీటైన సమాధానం చెబుతోంది. అయితే, ఎన్ని సార్లు తాను మహిళనని చెప్పినా సరే ఆమె ఎదుగుదలను చూసి సహించని కొంత మంది ఆమెను కావాలనే సూటిపోటి మాటలతో వేధించేవారు. అయినా, ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోకుండా.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాను. కొలంబియాలో జరిగే మిస్​ ఇంటర్నేషనల్​ ట్రాన్స్​–2021లో భారత్​ తరఫున ప్రాతినిథ్యం వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకొని, ఈ పోటీల్లో రన్నరప్ గా నిలిచాను. నేను కొలంబియాకు చేరుకుని, నా తోటి పోటీదారులను కలిసినప్పుడు, అది నాకు ఎంతో బలాన్నిచ్చింది. నాలాంటి ఎంతో మంది ట్రాన్స్ జెండర్స్​ తమను తాము ప్రదర్శించుకోగలిగే ఒక వేదికను కలిగి ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఈ పోటీలో పాల్గొనడం నాకు ఒక కల లాంటిది. ఈ పోటీల్లో నేను మొదటి స్థానాన్ని గెలుచుకోకపోయినా, నాకు ఇది మొదటి బహుమతి కంటే ఎక్కువే ఆత్మ సంతృప్తి ఇచ్చింది. ఇప్పుడు, నా ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా ఉందని, ప్రపంచం నా కుటుంబం అని గర్వంగా చెప్పగలను.”ఆమె అన్నారు.

కాగా, ఆర్చీ ఢిల్లీలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. స్కూల్​లో చదువుకునేటప్పుడే అమ్మాయిలా ఉండాలనిపించే మానసిక స్థితి గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు ఆందోళన చెందారు. తమ బిడ్డ అందరిలా కాకుండా వేరేలా ఉండటంతో భయపడిపోయారు. అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మానసికంగా సిద్ధపడ్డారు. అయితే ఆమెను అర్థం చేసుకొని అండగా నిలబడ్డారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: India, Transgender

ఉత్తమ కథలు