APSRTC APP : త్వరలో కొత్త యాప్ తెస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ... ఏంటి దాని ఉపయోగం? ఏం చెయ్యాలి?

APSRTC APP : కాలానుగుణంగా టెక్నాలజీని డెవలప్ చేసుకోవాలన్నది ఏపీ ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. మరి ఆర్టీసీలో తెస్తున్న కొత్త యాప్ ఎందుకో, ఏం ఉపయోగమో తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 30, 2020, 2:06 PM IST
APSRTC APP : త్వరలో కొత్త యాప్ తెస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ... ఏంటి దాని ఉపయోగం? ఏం చెయ్యాలి?
త్వరలో కొత్త యాప్ తెస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ...
  • Share this:
APSRTC Pratham App : ఏపీఎస్ ఆర్టీసీకి గూగుల్ ప్లే స్టోర్‌లో ఆల్రెడీ ఓ యాప్ ఉంది. అది జిల్లాల్లో బస్సుల్లో ప్రయాణించడానికి ఉపయోగపడుతోంది. ఐతే... సిటీ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్త యాప్ తేబోతోంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం కరోనా టెన్షన్ ఉంది కదా... అందువల్ల బస్సుల్లో టికెట్ తీసుకునే విధానం కూడా ఆన్‌లైన్‌లోకి తెచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులకు ఆర్డరేసింది. అంతే... ఓ కొత్త యాప్ రెడీ అవుతోంది. దాని పేరు ప్రథమ్ యాప్. ఈ నేమ్ ఫైనల్ కాలేదు. ప్రస్తుతానికి ఈ పేరు అనుకుంటున్నారు. వచ్చే నెలలోనే ఇది అందుబాటులోకి వస్తుంది. ముందుగా... విశాఖ, విజయవాడ సిటీ బస్సుల్లో ఈ యాప్‌ ద్వారా టికెట్లు కొనుక్కునేలా చెయ్యాలని ముందుగా భావించినా... ఇప్పుడు పల్లె వెలుగుసహా అన్ని బస్సులకూ ఈ యాప్‌నే వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతబాగా ఆ యాప్ ప్రభుత్వానికి నచ్చేసింది.

యాప్ వచ్చాక... ప్రజలంతా దీన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎప్పుడైనా బస్సు ఎక్కాలనుకుంటే... యాప్ ఓపెన్ చేసి... ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో చెప్పాలి. వెంటనే... అటుగా వెళ్లే బస్సుల లిస్ట్, టైమ్స్‌తో సహా వచ్చేస్తుంది. వాటిలో ఓ బస్సు సెలెక్ట్ చేసుకొని... మనీ పే చెయ్యాలి. డబ్బులు చెల్లించగానే... ఆన్‌లైన్‌లో ట్రింగ్ మని మెసేజ్ వచ్చేస్తుంది. అందులో పూర్తి వివరాలు ఉంటాయి. అంతే...

మరో విశేషమేంటంటే... మెసేజ్‌లో 4 అంకెల పిన్ కూడా వస్తుంది. బస్సు ఎక్కే ముందు కండక్టర్... పిన్ ఎంత అని అడుగుతారు. అది చెప్పగానే... కమాన్ అని బస్సు ఎక్కిస్తారు. బాగుంది కదా.
First published: June 30, 2020, 2:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading