మన దేశంలో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందువల్ల మనం విదేశాల నుంచి గోల్డ్‌ని దిగుమతి చేసుకుంటున్నాం. కానీ... ఏప్రిల్‌లో అనూహ్యంగా బంగారం దిగుమతులు 99.9 శాతం పడిపోయాయి. గత మూడు దశాబ్దాల్లో ఇంతలా దిగుమతులు పడిపోవడం ఇదే తొలిసారి. ఈ పరిస్థితి రావడానికి రెండు కారణాలున్నాయి. దేశంలో కరనా కారణంగా... బంగారం, జువెలరీ షాపులు మూతపడ్డాయి. అదే సమయంలో... విదేశాల నుంచి విమానాల రాకపోకలు లేవనీ, అందువల్ల గోల్డ్ దిగుమతులు కూడా లేవని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రపంచంలో బంగారాన్ని ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో భారత్ రెండోది. ఏప్రిల్‌లో భారత్‌కి 50 కేజీల స్వర్ణం మాత్రమే విదేశాల నుంచి దిగుమతి అయ్యింది. 2019లో ఏప్రిల్‌లో భారత్... 110.18 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. డబ్బు లెక్కల్లో చెప్పుకోవాలంటే... గతేడాది ఏప్రిల్‌లో దిగుమతి అయిన బంగారం విలువ... రూ.30019 కోట్లు. ఇప్పుడు ఏప్రిల్‌లో దిగుమతి అయ్యింది రూ.21 కోట్లు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాముల ధర రూ.43760 ఉంది. అదే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.46560 ఉంది.
ప్రస్తుతం విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాముల ధర రూ.43760 ఉంది. అదే 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ ధర రూ.46560 ఉంది.
Published by:Krishna Kumar N
First published:May 05, 2020, 12:18 IST